Reading Time: < 1 minute
Nani Bloody Romeo Shooting Date Delhi Sujeeth

Bloody Romeo: నేచురల్ స్టార్ నాని కొత్త అవతారంలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ‘సాహో’, ‘ఓజీ’ చిత్రాలతో స్టైలిష్ యాక్షన్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ సుజీత్‌తో కలిసి ఆయన చేస్తున్న సినిమా ‘బ్లడీ రోమియో’. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి తాజాగా షూటింగ్ షెడ్యూల్ వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్టోబర్ 17 నుంచి ఢిల్లీలో సినిమా షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత లండన్, హైదరాబాద్‌లోనూ కీలక సన్నివేశాలను తెరకెక్కించేందుకు చిత్ర బృందం ప్లాన్ రెడీ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో నాని పాత్రకు సంబంధించిన వివరాలు కూడా ఆసక్తికరంగా మారాయి. ఒకవైపు చెఫ్‌గా కనిపిస్తూనే, మరోవైపు గ్యాంగ్‌స్టర్‌గా హింసాత్మక యాంగిల్‌ని ప్లే చేసే పాత్రలో ఆయన కనిపించనున్నారనే ప్రచారం సాగుతోంది.

ఈ రెండు విభిన్నమైన షేడ్స్‌ను డైరెక్టర్ సుజీత్ ఎలా చూపించబోతున్నారన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. డార్క్ హ్యూమర్, స్టైలిష్ యాక్షన్ అంశాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ‘ది ప్యారడైజ్’లోని రగ్డ్ లుక్‌కు భిన్నంగా నాని ఈ సినిమా కోసం రెట్రో స్టైల్‌లో కనిపిస్తుండటం అభిమానుల్లో చర్చనీయాంశమైంది. కొత్త హెయిర్‌స్టైల్, బ్లాక్ గాగుల్స్‌తో ఆయన కనిపిస్తున్న లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. అక్టోబర్ 17న ఢిల్లీలో ప్రారంభమయ్యే తొలి షెడ్యూల్ తర్వాత లండన్, హైదరాబాద్‌లలోనూ షూటింగ్ జరగనుందని సమాచారం. అయితే ఈ షూటింగ్ షెడ్యూల్ వివరాలపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంలో నాని సరసన ప్రీతి ముకుందన్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. అలాగే ఈ సినిమాలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. నాని న్యాచురల్ యాక్టింగ్‌కి, సుజీత్ స్టైలిష్ మేకింగ్ తోడైతే ‘బ్లడీ రోమియో’ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి నెలకొంది.