
టాలీవుడ్‌లో డిఫరెంట్ కంటెంట్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సుహాస్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ‘మందాడి’ వంటి ప్రాజెక్ట్‌తో బిగ్ సక్సెస్ అందుకున్న ఈ టాలెంటెడ్ యాక్టర్.. ఈసారి రూటు మార్చి ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో పలకరించబోతున్నారు. అదే ‘హైడ్ అండ్ సిల్క్’ (Hide & Silk). తాజాగా విడుదలైన ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ సినీ ప్రియుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది.
మనసు దోచేలా టైటిల్ గ్లింప్స్..
‘హైడ్ అండ్ సిల్క్’ టైటిల్ వినగానే ఇదేదో రొటీన్ లవ్ స్టోరీ కాదనే ఫీలింగ్ కలుగుతోంది. టైటిల్‌కు తగ్గట్టుగానే గ్లింప్స్‌ను కూడా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రెజెంట్ చేశారు మేకర్స్. చేనేత, పట్టుచీరల నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ సినిమా ఉండబోతున్నట్లు గ్లింప్స్ హింట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా చీరల తయారీకి, ఓ అందమైన ప్రేమకథకు మధ్య లింక్ పెట్టిన విధానం ఆసక్తికరంగా ఉంది.
“కొన్ని ప్రేమకథలు రాయబడవు.. అవి నేయబడతాయి” అనే కాన్సెప్ట్ ఈ సినిమాపై అంచనాలను పెంచుతోంది. మగ్గంపై చీరను నేస్తున్న సుహాస్ విజువల్స్, తన పాత్ర చుట్టూ అల్లుకున్న ఎమోషనల్ టచ్ గ్లింప్స్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రతి చీరకూ ఒక కథ ఉంటుందనే భావనతో.. ఆ చీరను ధరించబోయే అమ్మాయితో తన జీవితానికి ఎలాంటి అనుబంధం ఏర్పడుతుందనే ఆసక్తిని రేకెత్తించేలా ఈ టైటిల్ గ్లింప్స్ రూపొందించారు.
సుహాస్‌కు జోడీగా సంజనా కృష్ణమూర్తి..
ఈ సినిమాలో సుహాస్ సరసన పరిమళ అండ్ కో బ్యూటీ సంజనా కృష్ణమూర్తి హీరోయిన్‌గా నటిస్తున్నారు. వెండితెరపై వీరిద్దరి కెమిస్ట్రీ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి మొదలైంది. ఇక సీనియర్ నటుడు తనికెళ్ల భరణి వాయిస్ ఓవర్ గ్లింప్స్‌కు ఎమోషనల్ డెప్త్‌ను యాడ్ చేస్తోంది.
►ALSO READ | బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్.. టాలీవుడ్‌లో డిజాస్టర్ : ‘హనుమాన్ అంశ్’కు ఏమైంది?
“రేయ్ కొత్తగా నేయి.. మిషిన్లు వాడు.. కానీ, మగ్గం మీద కూడా ఓ చీర నేయిరా.. చీర నేయడం అనేది ఒక పని కాదురా.. అది ఒక కళ. ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉన్నట్టు.. ప్రతి చీర మీద ఒక అమ్మాయి పేరు రాసి ఉంటుంది. చీరకు అందం నువ్వు నేసినప్పుడు కాదు.. దాన్ని నేసేటప్పుడు.. అది ఒక అమ్మాయిని ఎంచుకుంటుంది. ఆ అమ్మాయి కట్టుకున్నప్పుడే ఆ చీరకి అసలైన అందం’’ అని చెబుతూ కథలోని భావోద్వేగాలను, ప్రేమలోని సున్నితమైన అనుభూతులను ఆయన వాయిస్ మరింత అందంగా ఎలివేట్ చేస్తోంది.
తెలుగు ఇండస్ట్రీలోకి స్టోన్ బెంచ్ స్టూడియో ఎంట్రీ
తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమల్లో విభిన్నమైన సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న స్టోన్ బెంచ్ స్టూడియో.. ఇప్పుడు ‘హైడ్ అండ్ సిల్క్’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. నిర్మాత కార్తికేయన్ సంతానం ఈ ప్రాజెక్ట్‌తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. వర్థిక జైన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. విభిన్నమైన కథలను ప్రోత్సహించే నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న ఈ సినిమా ఎలాంటి కొత్తదనాన్ని అందించబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు, రాజేంద్ర బాలా ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడిగా ఆయనకు ఇది తొలి సినిమా కావడం విశేషం. అమృత్ రామనాథ్ సంగీతం అందిస్తుండగా, కార్తిక్ పళని సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైన్ ఈ చిత్ర ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించనుంది.
Between the weaving threads, their love story came together ❤️ #HideAndSilk – First Look and Title Promo out now. Telugu ▶️ https://t.co/YdAJ6DkBFn Tamil ▶️ https://t.co/6OCVJmmQHB Produced by @kaarthekeyens @024vartika @stonebenchers @misrilallpics @sidhartha1976. Starring – #Suhas @isanjkayy @TanikellaBharni #ActorNandu #Karunakaran. A film by @RajendraBala. An @AmritRamnath musical. @kalraman2016 @kalyanshankar @Alankar_Pandian @pavsone #Arulmozhithevankalimuthu @karthikpalanidp @cheps911 @sureshsrajan #Jashuva @PraveenRaja_Off @sherif_choreo @kk_lyricist @amolbodake @Prasadfilmlabs @valentino_suren @koothan @yellowtooths #Rajkumar @ashok_narayanan #Kovaivijayakumar @SMadhan17 @TeddyEniya @TeamVamsiShekar @proyuvraaj @MediaYouwe @HaashtagCinema @TheMugDigital
— Stone Bench (@stonebenchers) October 12, 2026
రొటీన్‌కు భిన్నంగా.. సరికొత్త లవ్ ట్రాక్!
సాధారణంగా ప్రేమకథలు అంటే కాలేజీ, ఫ్రెండ్స్, బ్రేకప్‌లు, రొమాంటిక్ సాంగ్స్ వంటి అంశాలు గుర్తొస్తాయి. కానీ ‘హైడ్ అండ్ సిల్క్’ మాత్రం చేనేత వృత్తిని, పట్టుచీరల అందాన్ని, విధి రాసే ప్రేమకథను కలిపి ఓ ఫ్రెష్ పాయింట్‌ను ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. సంప్రదాయ వృత్తి నేపథ్యంలో ఆధునిక ప్రేమకథను చెప్పే ప్రయత్నం సినిమాకు ప్రత్యేకమైన ఐడెంటిటీని తీసుకొచ్చే అవకాశం ఉంది.
కంటెంట్‌కు ఇంపార్టెన్స్ ఇచ్చే సుహాస్.. మరోసారి తనదైన నటనతో ఈ కథను ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలి. గ్లింప్స్‌లో కనిపించిన విజువల్స్, ఎమోషనల్ నరేషన్, డిఫరెంట్ కాన్సెప్ట్ చూస్తుంటే సినిమా మీద ఇప్పుడే పాజిటివ్ బజ్ మొదలైంది.
మొత్తానికి, టైటిల్‌తోనే అటెన్షన్ గ్రాబ్ చేసిన ‘హైడ్ అండ్ సిల్క్’.. గ్లింప్స్‌తో అంచనాలను మరింత పెంచింది. మరి ఈ సిల్క్ దారాల్లో సుహాస్ ఎలాంటి ప్రేమకథను నేయబోతున్నారో తెలియాలంటే మరిన్ని అప్‌డేట్స్ కోసం వెయిట్ చేయాల్సిందే!