Reading Time: < 1 minute
Meerut Blue Drum Murder Judge Cites Bhagavad Gita While Sentencing Muskan Sahil To Death

Meerut Blue Drum Murder:  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’ కేసులో మీరట్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భర్త సౌరభ్ రాజ్‌పుత్‌ను దారుణంగా హత్య చేసిన భార్య ముస్కాన్ రస్తోగి, సాహిల్ శుక్లాలకు కోర్టు ఉరిశిక్ష విధించింది. బుధవారం మరణశిక్ష విధిస్తూ న్యాయమూర్తి అరవింద్ కుమార్ మిశ్రా ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించారు. ‘‘తప్పులు చేసిన వారిని శిక్షించడము ధర్మమే’’అని కోర్టు తన విధిని నిర్వర్తిస్తుందని మహాభారతంలోని సూచనల్ని న్యాయమూర్తి ఉదహరించారు. ఈ విషయాన్ని బాధితుడి తరుఫు న్యాయవాది కోర్టు బయట మీడియాతో చెప్పారు.

మహాభారతంలోని భగవద్గీతలో కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశాన్ని కోర్టు ఉదహరించింది. శ్రీకృష్ణుడు అర్జునుడికి తన కర్తవ్యాన్ని, ధర్మాన్ని గుర్తించి గుర్తుచేస్తారు. సొంత వారినే చంపుకోవాల్సి వస్తుందని మానసిక వేధనతో ఉన్న అర్జునుడికి ధర్మం, కర్తవ్యాల గురించి బోధిస్తారు.

విదేశాల్లో మర్చంట్ నేవీ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సౌరభ్ రాజ్‌పుత్‌ను భారత్ వచ్చిన కొద్దిరోజులకే ముస్కాన్, సాహిల్ హత్య చేశారు. భోజనంలో మత్తు పదార్థాలు కలిపి, శరీరాన్ని నరికి ముక్కలుగా చేసి, ఒక డ్రమ్‌లో వేసి దానిని సిమెంట్‌తో కప్పేశారు. బుధవారం కోర్టు తీర్పుకు ముందు ముస్కాన్ తల్లిదండ్రులు కూడా తన అల్లుడు సౌరభ్ చాలా మంచి వ్యక్తి అని, దోషులకు మరణశిక్ష విధిస్తే తాము నిరసన తెలపబోమని చెప్పారు. ఈ కేసులో 126 సార్లు విచారణ జరగగా, 22 మంది సాక్ష్యాలను పరిగణలోకి తీసుకుని శిక్షను విధించారు.