Reading Time: < 1 minute
Prabhas Surprises Fauzi Actress Imanvi Special Birthday Treat

Prabhas Surprise: హీరోయిన్ ఇమాన్వీ పుట్టినరోజును మరింత స్పెషల్‌గా మార్చారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ‘ఫౌజీ’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇమాన్వీ బర్త్‌డే సందర్భంగా ప్రభాస్ ప్రత్యేకంగా ఫుడ్ పంపించడంతో ఆమె ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రభాస్ పంపించిన ఫుడ్ ట్రీట్‌కు సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన ఇమాన్వీ.. తన మనసు, కడుపు రెండూ నిండిపోయాయని పేర్కొంటూ ప్రభాస్‌కి కృతజ్ఞతలు తెలిపారు.

దీంతో ప్రభాస్ అభిమానులు ఈ పోస్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తనతో కలిసి పనిచేసే వారిని ప్రత్యేకంగా చూసుకోవడంలో ప్రభాస్‌కు మంచి పేరుంది. ఇప్పుడు ఇమాన్వీ పుట్టినరోజు సందర్భంగా ఆయన పంపించిన ఈ సర్‌ప్రైజ్ మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ ఒక పీరియాడిక్ నేపథ్యంలో సాగే ప్రేమకథగా రూపొందుతోంది. ఈ సినిమాతో ఇమాన్వీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. ఇప్పటికే ప్రభాస్‌తో ఆమె కాంబినేషన్‌పై ఆసక్తి నెలకొనగా, తాజాగా ఈ బర్త్‌డే సర్‌ప్రైజ్ వార్త కూడా అభిమానుల్లో చర్చకు దారితీసింది.