Reading Time: < 1 minute

జగిత్యాలలో విషాదం..బావిలో పడి ఇద్దరు ఏపీ యువకులు మృతి 

Caption of Image.

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంట శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. బావిలో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులను ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన ఆనంద్, సంజీవ్‌గా పోలీసులు గుర్తించారు.

పోలీసుల ప్రాథమిక అనుమానం ప్రకారం.. బావి పక్కన ఉన్న గోడపై కూర్చుని ఇద్దరు యువకులు మద్యం సేవిస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఒక యువకుడు ప్రమాదవశాత్తు బావిలో పడిపోగా, అతడిని కాపాడేందుకు మరో యువకుడు బావిలోకి దూకి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయినట్లు అనుమానిస్తున్నారు.మృతులైన ఆనంద్, సంజీవ్ కూలీ పనుల కోసం వారం రోజుల క్రితమే చింతకుంటకు వచ్చినట్లు సమాచారం. ఇంతలోనే ఇద్దరూ మృతి చెందడంతో విషాదం నెలకొంది.

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుల మృతికి గల ఖచ్చితమైన కారణాలు, ప్రమాదం జరిగిన తీరుపై వివరాలు సేకరిస్తున్నారు. దర్యాప్తు పూర్తయితే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

©️ VIL Media Pvt Ltd.