Reading Time: < 1 minute

రోడ్డు ప్రమాదంలో మిమిక్రీ ఆర్టిస్ట్ మృతి

Caption of Image.

పద్మారావు నగర్/కుషాయిగూడ, వెలుగు:  ఓఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ మిమిక్రీ, వెంట్రిలాక్విజం, మ్యాజిక్ కళాకారుడు సత్యనారాయణ (40) కన్నుమూశారు. ఆదివారం రాత్రి బతుకమ్మ వేడుకల్లో ప్రదర్శన ముగించుకుని హకీంపేట నుంచి హయత్‌‌‌‌నగర్ వైపు కారులో ఓఆర్​ఆర్​పై వెళ్తుండగా వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.

 కారు అదుపుతప్పి డివైడర్‌‌‌‌ను ఢీకొట్టడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. గమనించే వారు లేకపోవడంతో కారులోనే ఆయన ప్రాణాలు విడిచారు. 15 ఏండ్లుగా, మిమిక్రీ, మ్యాజిక్ రంగాల్లో 2 వేలకు పైగా ప్రదర్శనలిచ్చిన సత్యనారాయణ మృతిపై తెలంగాణ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు సామల వేణు, కళాకారుల దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. 

©️ VIL Media Pvt Ltd.