
హైదరాబాద్ లో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. 2026 అక్టోబర్ 12న అసెంబ్లీ ప్రాంగణంలో శాసనసభ సచివాలయ ఉద్యోగులతో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. బతుకమ్మ వేడుకల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ సిబ్బంది పాల్గొన్నారు. కొబ్బరికాయ కొట్టి బతుకమ్మ వేడుకలు ప్రారంభించారు స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ వాణి సురభి ఇతర ప్రముఖులు.
ఎన్ లినో పరిస్థితులు తొలిగి పోవాలని, వర్షాలు కురువాలని, ప్రజలంతా సస్యాశ్యామలంగా ఉండాలని బతుకమ్మ గౌరమ్మ తల్లిని కోరినట్లు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయలకు ప్రతీక అని అన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. రైతులను, ప్రజలు సుఖశాంతులతో ఉండేలా చూడాలని కోరినట్లు తెలిపారు.
రవీంద్ర భారతిలో బతుకమ్మ సంబురాలు:
తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతి లో ఘనంగా బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తున్నారు. ఇంటింటా బతుకమ్మ కార్నివాల్ పేరుతో ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. మహిళలు 9 రోజుల పాటు బతుకమ్మ ఆడుకునేందుకు రవీంద్ర భారతి ప్రాంగణం లో ఏర్పాట్లు చేశారు. 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్న వేడుకలు నిర్వహించనున్నారు.
ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకత తో సందడిగా బతుకమ్మ సంబురాలు సాగనున్నాయి. ఈరోజే మూడో రోజు ఘనంగా ముద్ద పప్పు బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి. మున్నూరు కాపు ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ముద్ద పప్పు బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు.
బతుకమ్మ సంబరాల్లో పెద్ద ఎత్తున ఇతర జిల్లాల నుండి మున్నూరు కాపు మహిళా అడబిడ్డలు పాల్గొన్నారు. డప్పు చప్పుళ్లు, కళాకారుల నృత్యాల తో పాటు ప్రత్యేక ఆకర్షణగా అమ్మవారి ఘటాలను ఏర్పాటు చేశారు.