
పుణెలోని పింప్రీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కౌశిక్ ముల్య (21), రిషిత ముల్య (17) అనే అన్నాచెల్లి చనిపోయారు. ఈ ఘటన బాధిత కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చినప్పటికీ అవయవ దానానికి ఈ కుటుంబం ముందుకొచ్చింది. రిషిత అవయవాలను దానం చేయాలని వారి కుటుంబం నిర్ణయించుకుంది. ఈ ప్రమాదం ఆదివారం రాత్రి నిగ్డిలోని పూనా గేట్ హోటల్ సమీపంలో జరిగింది.
ఘోరవ్‌దేశ్వర్ నుంచి బైక్‌పై తిరిగి వస్తుండగా, వెనుక నుంచి వచ్చిన మరో బైక్ వీరిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వారిద్దరినీ మొదట యశ్వంత్‌రావు చవాన్ ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఇంద్రాయణి నగర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 10:30 గంటల సమయంలో కౌశిక్ మరణించాడు. అనంతరం రిషితను బనేర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, ఆమె చికిత్సకు స్పందించడం లేదని వైద్యులు తెలిపారు. కౌశిక్.. అలందిలోని ఒక కళాశాలలో కంప్యూటర్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతుండగా, రిషిత 11వ తరగతి చదువుతోంది.
►ALSO READ | 14 ఏళ్ల పోరాటం.. BMW కార్ ఓనర్కు ఇన్సురెన్స్ కంపెనీ నుంచి రూ.70 లక్షలు
వీరి తండ్రి రవి ముల్య ఇంద్రాయణి నగర్ మినీ మార్కెట్‌లో టైలర్‌గా పనిచేస్తున్నారు. వీరి కుటుంబం భోసారిలోని ఇంద్రాయణి నగర్‌లో నివసిస్తోంది. ఈ కుటుంబం తమ ఇద్దరు బిడ్డలను కోల్పోయి శోకసంద్రంలో మునిగిపోయింది.