
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఇప్పుడు మరింత రసవత్తరంగా మారుతోంది. రోజురోజుకూ ఊహించని ట్విస్టులు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, సంచలన ఎలిమినేషన్లతో హౌస్‌లో హీట్ పెరిగిపోతోంది. ఆడియన్స్‌ను కట్టేపడేసేందుకు మేకర్స్ చేస్తున్న ప్రయత్నాలు ఎంతో డ్రామాను పండిస్తున్నాయి. ఐదో వారం హౌస్ లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి.
లేటెస్ట్ గా జరిగిన డబుల్ ఎలిమినేషన్‌లో అపూర్వ , చరణ్ హౌస్ నుండి బయటకు వెళ్లడం ప్రేక్షకులను షాక్‌కు గురిచేసింది. ముఖ్యంగా చరణ్ ఎలిమినేషన్ అన్యాయమంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో నిరసన తెలుపుతున్నారు. చరణ్‌కు మరో అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఐదుగురు కొత్త వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టడంతో రీ-ఎంట్రీ దాదాపు అసాధ్యమనే చెప్పాలి.
హౌస్‌లోకి బుల్లితెర నటుడు శివకుమార్, నటి దక్షి గుత్తికొండ, డ్యాన్సర్లు నీతూ నటరాజ్, శ్వేతా నాయుడు, యూట్యూబర్ రామకృష్ణ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. హోస్ట్ నాగార్జున వీరికి ఇచ్చిన టాస్క్‌లో భాగంగా అందరూ ఒకే మాటపై నిలవడం విశేషం. హౌస్‌లోకి వెళ్లగానే అందరూ షాలినిని టార్గెట్ చేస్తామని కుండబద్దలు కొట్టేశారు.
షాలిని ఆటపై ఫోకస్ పెట్టకుండా రోహిత్‌తో బంధానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని, గేమ్స్ గెలవడంలో విఫలమవుతోందని కొత్త కంటెస్టెంట్లు విమర్శించారు. ఒకేసారి ఐదుగురు తనను టార్గెట్ చేయడం షాలినికి పెద్ద సవాలుగా మారింది. . ప్రస్తుతం నామినేషన్ల పర్వం ప్రారంభంకానుండటంతో ఇంట్లో ఎలాంటి వార్ జరుగుతుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీల రాకతో హౌస్‌లో సమీకరణాలు పూర్తిగా మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
మరోవైపు, బిగ్ బాస్ షోకు గట్టి పోటీగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అక్టోబర్ 14 నుండి ‘ది ట్రైటర్స్ తెలుగు’ (The Traitors Telugu) రియాలిటీ షో ప్రీమియర్ కానుంది. తేజ సజ్జా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో చినమయి శ్రీపాద, హర్షవర్ధన్, ప్రగతి, నిఖిల్ విజయేంద్ర సింహ, విద్యురామన్, విష్ణు ఒయ్ తదితరులు కంటెస్టెంట్లుగా బరిలోకి దిగుతున్నారు. నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షోకు ఈ కొత్త రియాలిటీ షో ఎలాంటి సవాలు విసురుతుందో వేచి చూడాలి.