Reading Time: < 1 minute

Haindava Teaser : దేవుళ్ల విగ్రహాలు మిస్సింగ్.. నాస్తిక పోలీస్ ఆఫీసర్ చేతికి కేసు ఇన్వెస్టిగేషన్ !

Caption of Image.

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్  డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ ‘హైందవ’ (Haindava). నూతన దర్శకుడు లుధీర్ బైరెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త  కథానాయికగా నటిస్తోంది. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అంతే కాదు ఈ చిత్రాన్ని  ప్రపంచవ్యాప్తంగా 2026 నవంబర్ 27న  విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఈ టీజర్ అత్యంత ఆసక్తికరంగా, సస్పెన్స్‌తో కూడుకుని ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పురాతన దేవాలయాల నుంచి వరుసగా 10 దివ్య దేవుళ్ల విగ్రహాలు మాయమవ్వడం అనే సరికొత్త అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సున్నితమైన, ప్రమాదకరమైన కేస్‌ను ఛేదించే బాధ్యతను ఒక పోలీస్ ఆఫీసర్‌కు అప్పగిస్తారు. 

అయితే ఈ ప్రయాణంలో అసలైన ట్విస్ట్ ఏమిటంటే ఆ పోలీస్ ఆఫీసర్ దేవుడిపై అస్సలు నమ్మకం లేని ఒక హార్డ్‌కోర్ నాస్తికుడు. దేవుడి ఉనికినే విశ్వసించని వ్యక్తి, దేవుళ్ల విగ్రహాల మిస్సింగ్ కేసును ఎలా ఛేదిస్తాడు? ఈ విచారణలో అతడికి ఎదురయ్యే సవాళ్లు ఏమిటి? విగ్రహాలను దొంగిలించింది ఎవరు? వాటి వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలతో టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

►ALSO READ | Gopichand :’భారత వర్ష’ నుంచి అమ్మవారి భక్తిగీతం.. దసరా వేళ మారుమోగుతున్న ‘అమ్మ కదిలి వచ్చే’!

ఈ చిత్రంలో జె.డి. చక్రవర్తి, సౌరభ్ సచ్‌దేవా, మహేష్ మంజ్రేకర్, శివాజీ రాజా, గెటప్ శ్రీను వంటి సీనియర్ మరియు పవర్‌ఫుల్ నటీనటులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేష్ చందు అత్యంత భారీ బడ్జెట్‌తో, హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లీయాన్ జేమ్స్ (Leon James) అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సస్పెన్స్ డ్రామాను మరో స్థాయికి తీసుకెళ్లనుంది. కాన్సెప్ట్, యాక్షన్, విజువల్స్ అన్నీ కుదిరిన ‘హైందవ’ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.

 

©️ VIL Media Pvt Ltd.