Reading Time: < 1 minute

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. హిందూ మహాసభ ట్రస్ట్ స్వామివారికి గొడుగులు సమర్పణ

Caption of Image.

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు సందర్భంగా స్వామివారికి హిందూ మహాసభ ట్రస్ట్ చైర్మన్ వసంతం కుమార్  నూతన గొడుగులు కానుకగా సమర్పించారు.  గత 15 సంవత్సరాలుగా స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారికి,తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పద్మావతి అమ్మవారికి నూతన గొడుగులు సమర్పిస్తున్నారు.

శ్రీపురం నారాయణి అమ్మ ఆలయంలో తోలి పూజాలు నిర్వహించిన అనంతరం చెన్నై నుంచి 10 రోజులు పాటు ఊరేగింపుగా తిరుమలకు హిందూ మహాసభ సభ్యులు  చేరుకున్నారు.

ALSO READ : నవరాత్రి బ్రహ్మోత్సవాలు. ఐదు లక్షల కట్ ఫ్లవర్లతో ప్రత్యేక అలంకరణ

ఇవాళ ( అక్టోబర్​ 12) వైభోత్సవ మండపం వద్ద 9 నూతన గొడుగులను ఆలయ డిప్యూటీ ఇఓ భయ్యాల భాస్కర్,పాలకమండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి,రాష్ర్ట హస్తకళలు చేనేత అభివృద్ధి సంస్థ ఛైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్,ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ సమక్షంలో టిటిడికి అందజేశారు. స్వామివారి పై అచెంచలమైన భక్తిశ్రద్దలతో 15 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న దాతను టిటిడి అధికారులుఅభినందించారు. 

©️ VIL Media Pvt Ltd.