
డబ్బు లావాదేవీల విషయంలో జరిగిన గొడవ కారణంగా అమృత్‌సర్‌లోని YES బ్యాంక్ బ్రాంచ్లో పనిచేస్తున్న లోన్ మేనేజర్‌ను బ్యాంకు ప్రాంగణంలోనే కాల్చివేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. బ్యాంకులో రిలేషన్‌షిప్ మేనేజర్‌గా పనిచేస్తున్న జస్పాల్ సింగ్‌కు, డబ్బు లావాదేవీల విషయంలో కొంతమందితో వాగ్వాదం జరిగిందని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) గగన్‌దీప్ సింగ్ తెలిపారు.
ఇద్దరు ముగ్గురు వ్యక్తులు బ్రాంచ్‌కు వచ్చారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత ఈ గొడవ కొట్లాటకు దారితీసింది. ఆ కొట్లాటలో, వారిలో ఒక వ్యక్తి కాల్పులు జరపడంతో, లోన్ మేనేజర్ గౌరవ్ గాయపడ్డాడు. నిందితుడు వెంటనే అక్కడి నుంచి పారిపోగా, గౌరవ్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనలో ప్రమేయం ఉన్న అనుమానితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలం, చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కేసు దర్యాప్తు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అమృత్‌సర్‌లోని మాల్ రోడ్‌లో ఉన్న YES బ్యాంక్ శాఖలో ఈ ఘటన జరిగింది. ఈ కాల్పుల ఘటనలో లోన్ ఆఫీసర్ గౌరవ్ దివాన్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు.
►ALSO READ | మమతా బెనర్జీపై హత్యాయత్నం.. అత్త అంటూ వచ్చి కత్తితో..!