Reading Time: < 1 minute
ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు.. రెండో రోజు గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు

దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగురాష్ట్రాల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన విజయవాడ ఇంద్రకీలాద్రిపై సోమవారం రెండోరోజు శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా అమ్మవారు గాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి భక్తులకు దర్శనం ఇస్తున్నారు. దీంతో ఉదయం 4గంటల నుంచే భక్తులు అమ్మవారి దర్శనానికి క్యూలో నిల్చొని దర్శనం చేసుకుంటున్నారు.

అయితే నవరాత్రి వేడుకల్లో రెండు రోజైన సోమవారం అమ్మవారిని గాయత్రీ దేవిని పంచముఖాలు కలిగిన రూపంలో పూజిస్తారు. ఈ రోజు త్రిమూర్త్యాంశ రూపిణిగా విలసిల్లే గాయత్రీ మాతను పూజించడం వల్ల భక్తులకు జ్ఞానం, తేజస్సు, శారీరక ఆరోగ్యం, సమస్త మంత్ర సిద్ధి కలుగుతాయని విశ్వాసం.

అయితే దసరా నవరాత్రి ఉత్సవాల్లో తొలిరోజైన ఆదివారం భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఏకంగా నిన్న ఒక్కరోజే సుమారు లక్షమంది భక్తులు బాలాత్రిపుర సందరిగా కనిపించిన దుర్గమ్మ వారిని దర్శించుకుని మొక్కులు సమర్పించారు. ఇక ఈ రోజు దర్శనాల కోసం కూడా వేలాది మంది భక్తులు రాత్రి నుంచే క్యూలు కట్టారు. ప్రస్తుతం గాయత్రీదేవి రూప దుర్గమ్మ దర్శనాలు కొనసాగుతున్నాయి.

వీడియో చూడండి,,



మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.