Reading Time: 2 minutes
Oppo Find X10 Series India Launch On October 22 With 200mp Triple Cameras Features And Offers

OPPO Find X10 Series: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్. ఒప్పో (OPPO) తన ఫ్లాగ్‌షిప్ Find X10 సిరీస్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. OPPO Find X10 సిరీస్‌ను అక్టోబర్ 22న భారత్‌లో అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ సిరీస్‌తో పాటు OPPO Enco X4 వైర్‌లెస్ ఇయర్‌బడ్స్, OPPO Pad Mini Matte Display Editionను కూడా విడుదల చేయనుంది.

OPPO Find X10 సిరీస్‌లో కెమెరాలపైనే ప్రధానంగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. హ్యాసెల్‌బ్లాడ్‌తో OPPO కొనసాగిస్తున్న భాగస్వామ్యంలో భాగంగా ఈ ఫోన్లలో ట్రిపుల్ 200MP కెమెరా సిస్టమ్‌ను అందించనున్నారు. ముఖ్యంగా Find X10 Pro Maxలోనూ ఇదే కెమెరా సెటప్ ఉండనున్నట్లు కంపెనీ టీజర్ల ద్వారా వెల్లడించింది. వీటితో పాటు OPPO Hasselblad Teleconverter లెన్స్ యాక్సెసరీని కూడా తీసుకురానుంది. ఇది ఫోన్ కెమెరా మాడ్యూల్‌పై నేరుగా అమర్చుకునేలా రూపొందించారు. దీంతో మొబైల్ ఫొటోగ్రఫీని మరింత ప్రొఫెషనల్ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేసారు. ఈ సిరీస్ ColorOS 17పై పనిచేయనుంది.

Find X10 సిరీస్‌తో పాటు OPPO Pad Mini Matte Display Editionను కూడా కంపెనీ లాంచ్ చేయనుంది. ఈ టాబ్లెట్‌లో Qualcomm Snapdragon 8 Gen 5 మొబైల్ ప్లాట్‌ఫామ్‌ను అందించనున్నారు. ఇందులో 8.8 అంగుళాల 2.5K OLED Eye-Comfort Matte డిస్‌ప్లే ఉంటుంది. స్క్రీన్‌పై రిఫ్లెక్షన్స్, గ్లేర్‌ను తగ్గించేలా దీన్ని రూపొందించారు. అలాగే 144Hz రిఫ్రెష్ రేట్, 2.99mm అల్ట్రా-థిన్ బెజెల్స్ ప్రత్యేకతలుగా ఉన్నాయి. స్టైలస్‌తో రాయడానికి, స్కెచ్‌లు వేయడానికి పేపర్‌పై రాస్తున్న అనుభూతిని అందించే ట్యాక్టైల్ ఫినిష్ కూడా ఇందులో ఉంటుంది. సన్నని, తేలికైన బాడీతో ఒక చేత్తో సులభంగా ఉపయోగించుకునేలా దీన్ని రూపొందించారు. 8,000mAh బ్యాటరీని ఇందులో అందించనున్నారు.

అలాగే OPPO Enco X4 ఇయర్‌బడ్స్‌ను ప్రీమియం ఆడియో అనుభవాన్ని అందించేలా రూపొందించారు. ఇందులో డ్యూయల్ డైనమిక్ డ్రైవర్లతో పాటు డ్యూయల్ DACలను అందించారు. డెన్మార్క్‌కు చెందిన ప్రముఖ ఆడియో సంస్థ Dynaudioతో కలిసి వీటిని ట్యూన్ చేశారు. AI ఆధారిత Real-time Adaptive ANC ఫీచర్ కూడా ఇందులో ఉంటుంది. చుట్టుపక్కల వాతావరణంలోని శబ్దాలను బట్టి నాయిస్ క్యాన్సిలేషన్ స్థాయిని ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తుంది.

లాంచ్‌కు ముందే ఒప్పో ఇండియా అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లో రూ.9 ప్రివిలేజ్ ప్యాక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అక్టోబర్ 21 రాత్రి 11:59:59 గంటల్లోపు ఈ ప్యాక్‌ను కొనుగోలు చేసిన వారికి అక్టోబర్ 22 నుంచి 25 వరకు ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి. Find X10 లేదా Find X10 Pro Max కొనుగోలు చేసే వారికి ప్రత్యేక ప్రీమియం గిఫ్ట్ బాక్స్ లభిస్తుంది. ఇందులో Enco Air5 Pro ఇయర్‌బడ్స్‌తో పాటు సంబంధిత ఫోన్ కేస్ ఉంటాయి. అలాగే మొదటి 50 మంది కస్టమర్లకు OPPO Pad SE (4GB + 128GB Wi-Fi) ఉచితంగా పొందే అవకాశం ఉంది. దీనితో పాటు OPPO Pad Miniపై రూ.1,000 డిస్కౌంట్ కూపన్, OPPO Enco X4పై రూ.500 డిస్కౌంట్ కూపన్ కూడా అందించనున్నారు.