Reading Time: < 1 minute

సీఈసీ జ్ఞానేష్ కుమార్ను తొలగించాలని అసెంబ్లీ తీర్మానం

Caption of Image.

సర్ ప్రక్రియలో అవకతవకలు, ఓట్ల చోరీకి బాధ్యునిగా కేంద్ర ప్రధాన  ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ ను తొలగించాలని కేరళ అసెంబ్లీ తీర్మానం చేసింది. 2026 అక్టోబర్ 12న ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని శాసన సభ ఆమోదించింది. 

అసెంబ్లీ ఓపెనింగ్ సెషన్ లో ప్రవేశ పెట్టిన తీర్మానంలో ముఖ్యంగా మూడు డిమాండ్లు చేసింది. సర్ ప్రక్రియలో అవకతవకలు, ఓటర్ల హక్కులు, సీఈసీ వ్యవహారంపై రిజొల్యుషన్ ను ప్రవేవ పెట్టింది. 140 మంది సభ్యులున్న కేరళ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. 

►ALSO READ | జనసంద్రమైన ఢిల్లీ రోడ్లు.. డెమొక్రసీ మార్చ్ను ముందుండి నడిపిస్తున్న రాహుల్, ప్రియాంక

ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి రాజ్యాంగంలో సవరణ చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. ప్రధాన  మంత్రి, ప్రతిపక్ష నేత, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సెలెక్షన్ కమిషన్ లో ఉండేలా చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేసింది. 

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకం. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేది ఓటు హక్కు, ఎన్నికల ప్రక్రియనేనని అన్నారు కేరళ సీఎం  వీడీ సతీషన్. ఫ్రీ, ఫెయిర్ ఎలక్షన్ల జరగాలని డిమాండ్ చేస్తున్నట్లుగా ఎక్స్ లో పోస్ట్ చేశారు. 

©️ VIL Media Pvt Ltd.