
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ కేంద్రంగా పనిచేస్తున్న నిర్మాణ రంగ అదెసివ్స్ (జిగురు ఉత్పత్తులు) తయారీ సంస్థ వీబాండ్ అంతర్జాతీయ మార్కెట్లలోకి ప్రవేశిస్తోంది. హైదరాబాద్లో బుధవారం ఎనిమిది ఉత్పత్తులను ఆవిష్కరించింది.
జీసీసీ దేశాలతో పాటు ఆఫ్రికా మార్కెట్లోకి ప్రవేశించడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. మై హోమ్, అశోక, ఎల్ అండ్ టీ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలకు, గోవా విమానాశ్రయ ప్రాజెక్టులకు సేవలు అందిస్తున్నామని తెలిపింది. టైల్స్టోన్ బెడ్ ఉత్పత్తిని భారత మార్కెట్లో తొలిసారిగా పరిచయం చేస్తున్నామని ఎండీ, సీఈఓ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.