
సీఎం చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ అయ్యారు. మంగళవారం ( అక్టోబర్ 13 ) విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయ్ తర్వాత సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలుగు గంగ నీటి విడుదలపై అంశంపై చర్చించారు ఇరు రాష్ట్రాల సీఎంలు. ఈ ఏడాదికి 4.08 టీఎంసీల నీరు అందించిందని… ప్రస్తుత పరిస్థితుల్లో మరింత నీటిని విడుదల చేయాలని చంద్రబాబును కోరారు సీఎం విజయ్.
విజయ్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు సీఎం చంద్రబాబు. నీటి లభ్యతను బట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు చంద్రబాబు. ఈ భేటీలో నీటి అంశం మాత్రమే కాకుండా ఏపీ, తమిళనాడుకు ఎంతో కీలకమైన గోదావరి కావేరి నదుల అనుసంధానం గురించి కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. నదుల అనుసంధానం ద్వారా భవిష్యత్తులో ఏర్పడే నీటి ఎద్దడి నివారించవచ్చని.. రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు ఇరు రాష్ట్రాల సీఎంలు.ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, నిమ్మల రామానాయుడు, ఎంపీ మాగుంట పాల్గొన్నారు.
►ALSO READ | బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
ఇవాళ మధ్యాహ్నం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న సీఎం విజయ్ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఇవాళ రాత్రి జరగనున్న విజయవాడ ఉత్సవ్ 2.0 వేడుకల్లో పాల్గొని అనంతరం చెన్నైకి తిరిగి వెళ్లనున్నారు సీఎం విజయ్.