
ప్రస్తుతం ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా.. ఏ ఇస్స్టాగ్రామ్ రీల్ చూసినా ఒకటే పాట మార్మోగిపోతోంది. అదే ‘జిమ్ జిమ్ తార.. జిమ్ జిమ్ తార.. జిలేబీ తేరా చిన్నోడా’!. ఈ సాంగ్ ను పూర్తిగా అధికారికంగా విడుదల కాకముందే నెటిజన్లు, సెలబ్రిటీల రీల్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ క్రేజీ వైబ్రెంట్ సాంగ్ ఫుల్ వెర్షన్‌ను చిత్ర యూనిట్ ప్రముఖ ఆదిత్య మ్యూజిక్ (Aditya Music) ద్వారా అధికారికంగా యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది.
హారర్ కామెడీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘పర్ణశాల’ చిత్రం నుంచి వచ్చిన ఈ పాటను జి. లక్ష్మిదేవి స్వయంగా రచించి, ఎంతో ఎనర్జెటిక్‌గా ఆలపించింది. పాటలోని మాస్ బీట్, క్యాచీ లిరిక్స్ విపరీతంగా ఆకట్టుకోవడంతో యూట్యూబ్‌లో విడుదలైన కొద్ది నిమిషాల్లోనే లక్షలాది వ్యూస్‌తో ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లింది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వై.జి. భరత్ మాట్లాడుతూ.. పాట ప్రోమోకే ఊహించని రీతిలో వేల సంఖ్యలో రీల్స్, మీమ్స్ వచ్చాయి. ఇప్పుడు ఫుల్ సాంగ్ రాకతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఆదిత్య మ్యూజిక్ సంస్థ ద్వారా ఈ పాటను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. థియేటర్లలో ఈ పాటకు ప్రేక్షకులు వేసే స్టెప్పులు నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయని అని ధీమా వ్యక్తం చేశారు.
►ALSO READ | ‘రామాయణం’లో జటాయువుగా అనుపమ్ ఖేర్.. అంచనాలు పెంచిన ఫస్ట్ లుక్!
ఎస్‌ఎల్‌టీ ఫిలిమ్స్ (SLT Films) పతాకంపై నిర్మాత మంచి వెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వై.జి. భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. వినూత్న ప్రచార చిత్రాలు, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. హారర్ ఎలిమెంట్స్‌తో పాటు కడుపుబ్బ నవ్వించే కామెడీ, థ్రిల్లింగ్ ట్విస్టులతో వస్తున్న ఈ ‘పర్ణశాల’ సినిమా త్వరలోనే థియేటర్లలో అలరించడానికి సిద్ధమవుతోంది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్.