Reading Time: < 1 minute
Nayanthara Political Entry Rumours Vignesh Shivan Response

Nayanthara: తమిళ సినీ పరిశ్రమ నుంచి ప్రముఖ నటుడు విజయ్ రాజకీయాల్లోకి వచ్చి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత.. కోలీవుడ్ తారల పొలిటికల్ ఎంట్రీలపై చర్చలు మరింత ఊపందుకున్నాయి. ఇప్పటికే ధనుష్, శివకార్తికేయన్ వంటి హీరోలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారంటూ కోలీవుడ్‌లో జోరుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా పాలిటిక్స్‌లోకి రాబోతున్నారని, 2031 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సైతం రంగం సిద్ధం చేసుకుంటున్నారంటూ కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. తాజాగా ఈ రూమర్లపై ఆమె భర్త, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ స్పందించి పూర్తి స్పష్టతనిచ్చారు.

ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఓ అన్నదాన కార్యక్రమంలో విఘ్నేశ్ శివన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు నయనతార పొలిటికల్ ఎంట్రీపై నేరుగా ప్రశ్నించారు. 2031 తమిళనాడు ఎన్నికల్లో ఆమె పోటీ చేసే అవకాశం ఉందా అని అడగ్గా.. విఘ్నేశ్ కూల్‌గా సమాధానమిస్తూ ఆ ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టారు. “ప్రస్తుతం నయన్ పిల్లలతో గడపడాన్ని ఎంజాయ్ చేస్తోంది. మా ఆలోచనలన్నీ వాళ్ల పెంపకం చుట్టూనే తిరుగుతున్నాయి. ఫ్యామిలీ, కెరీర్.. ప్రస్తుతానికి ఈ రెండే మా ప్రయారిటీ. ఈ లైఫ్ మాకెంతో ప్రశాంతతను, సంతృప్తిని ఇస్తోంది” అంటూ ప్రస్తుతానికి రాజకీయాల ఆలోచనే లేదన్న సంకేతాలు ఇచ్చారు. నయన్ పాలిటిక్స్ వార్తలను తోసిపుచ్చుతూ విఘ్నేశ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.