Reading Time: < 1 minute

జనసేనలోకి వంగవీటి రాధా..విజయవాడ మేయర్ రేసులో..!

Caption of Image.

ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సమయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే వంగవీటి రాధా టీడీపీని వీడి జనసేన పార్టీలో చేరారు. బుధవారం ( అక్టోబర్ 14 ) పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు రాధా. ఆయనను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పవన్ కళ్యాణ్.

రాధా విజయవాడ మేయర్ రేసులో ఉన్నారని.. జనసేనలో చేరనున్నారని గత కొద్దిరోజులుగా ప్రచారంలో ఉన్నట్లే ఇవాళ వంగవీటి రాధా పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో వైసీపీ నుంచి విజయవాడ మేయర్ స్థానానికి ఎవరు బరిలోకి దిగుతారన్నది ఆసక్తిగా మారింది.

►ALSO READ | ఏపీలో లోకల్ వార్ కు కౌంట్ డౌన్… స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల..

ఇదిలా ఉండగా… అర్బన్ బాడీ ఎన్నికలకు సమయంలో రెండు వారాలు మాత్రమే ఉన్న క్రమంలో ప్రధాన పార్టీల్లో హడావిడి మొదలైంది. కూటమిలో సీట్ల సర్దుబాటు ఇంకా ఓ కొలిక్కిరాకపోవడంతో టీడీపీ, జనసేన,బీజేపీ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది. ఇక వైసీపీ స్థానికంగా నెలకొన్న ఈక్వేషన్స్ ని బట్టి ఎక్కడికక్కడ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉంది.
 

©️ VIL Media Pvt Ltd.