Reading Time: < 1 minute

జనగామలో గుప్త నిధుల తవ్వకాల కలకలం… గుడిలో శివలింగాన్ని పక్కకు జరిపి…!

Caption of Image.

ఇది ఏఐ జమానా… సృష్టికి ప్రతిసృష్టి చేసే రేంజ్ లో డెవలప్ అవుతోంది ఏఐ.స్టూడెంట్స్ సైతం ఏఐతో అద్భుతాలు చేస్తున్నారు. ఇలాంటి రోజుల్లో కూడా మాయా  మంత్రాలు, గుప్త నిధులు అంటూ తిరుగుతున్నారు కొంతమంది జనం. జగిత్యాల జిల్లా జనగామలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపాయి. జనగామ మండలం సిద్దెంకి గ్రామంలోని సిద్ధుల గుట్ట శివాలయంలో  తవ్వకాలు జరిపారు దుండగులు. శివాలయంలో శివలింగాన్ని పక్కకి జరిపి మరీ తవ్వకాలు జరిపారు. మంగళవారం ( అక్టోబర్ 13 ) వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..

భవాని మాల ధరించిన స్వాములు దర్శనం కోసం గుట్ట మీద శివాలయానికి వెళ్లారు. ఈ క్రమంలో తవ్వకాలు గమనించిన స్వాములు షాక్ అయ్యారు. ఈ ఘటనపై గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల ఫిర్యాదుతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు అవమానితులు ఉండగా  ఇద్దరిని  అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు పోలీసులు. పరారీలో ఉన్న మరొక నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు పోలీసులు.

►ALSO READ | జాయింట్ సర్వే రిపోర్ట్ కోసం రూ.30 లక్షల లంచం… ఏసీబీ వలలో అబ్దుల్లాపూర్ మెట్ సర్వేయర్, ఎమ్మార్వో…

©️ VIL Media Pvt Ltd.