
హైదరాబాద్, వెలుగు:లేబర్ కాంట్రాక్టర్ల కోసం క్యాప్టెక్ టెక్నాలజీస్ తన ఈ–ఫోర్స్ ప్లాట్ఫామ్ను తిరిగి ప్రారంభించింది. దీంతో కార్మికుల నియామకం ఐదు రెట్లు వేగంగా జరుగుతుంది. ఈ ప్లాట్ఫారమ్ ద్వారా ప్రస్తుతం 30కి పైగా ప్రాజెక్టులలో 5,000 మందికి పైగా కాంట్రాక్టర్లు, ఐదు లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు.
పని కేటాయించే ముందే ఇందులో బీఓక్యూ, డ్రాయింగ్స్, పాన్, జీఎస్టీ, బ్యాంక్ వివరాలను తనిఖీ చేస్తారు. ఇది నిర్మాణ కంపెనీల ఈఆర్పీకి నేరుగా అనుసంధానం అవుతుంది కాబట్టి సైట్ సమాచారాన్ని ఒకసారి నమోదు చేస్తే సరిపోతుంది. టెక్నాలజీ తెలియని కాంట్రాక్టర్లకు ఏఐ ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్ల ద్వారా అవగాహన కలిగిస్తారు.