
నవరాత్రి, దసరా సందర్భంగా హోండా తమ కార్లపై భారీ డిస్కౌంట్స్ ఇస్తోంది. అమేజ్, సిటీ, ఎలివేట్ మోడళ్లలో ఎంపిక చేసిన వేరియంట్లకు గరిష్టంగా రూ.2.35 లక్షల వరకు పండుగ ఆఫర్లను ప్రకటించింది. ఎలివేట్ ఎస్యూవీ (ఫేస్లిఫ్ట్ లేని వేరియంట్ల) పై కంపెనీ అత్యధికంగా రూ.2.35 లక్షల వరకు భారీ ప్రయోజనాలను అందిస్తోంది. దీని ధర రూ.11.69 లక్షల నుంచి రూ.16.43 లక్షల వరకు ఉంది. మిడ్సైజ్ సెడాన్ హోండా సిటీ ఫేస్లిఫ్ట్పై రూ.1.7 లక్షల వరకు ప్రయోజనాలు అందిస్తున్నారు. దీని ధర రూ.12.08 లక్షల నుంచి రూ.16.35 లక్షల వరకు ఉంది. ఎంట్రీ-లెవల్ కాంపాక్ట్ సెడాన్ అమేజ్పై రూ.67వేల వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ బండి ధర రూ.7.20 లక్షల నుంచి మొదలవుతోంది.