
Thursday Horoscope October 15 2026: జీవితంలో ప్రతి రోజు కొత్త అవకాశాలు, సవాళ్లు ఎదురవుతుంటాయి. ఏ పనులు చేపట్టాలి?.. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురుకావచ్చు? వంటి విషయాలను తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపిస్తారు. ఈ నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు గురువారం (2026 అక్టోబర్ 15) నాటి ద్వాదశ రాశుల ఫలితాలు, ఆయా రాశుల వారు ఆచరించాల్సిన దైవారాధన వివరాలు చెప్పారు.
సింహ రాశి వారు ప్రజా సంబంధాలు, సామాజిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు వేయాలి. రాజకీయ పరిచయాలు కొన్ని పనులకు ఉపయోగపడవచ్చు. కీలక సమావేశాల్లో సానుకూల ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలను పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. శ్రీ త్రిపుర సుందరి అమ్మవారి అష్టకం పారాయణం చేయాలని సూచిస్తున్నారు. కన్యా రాశి వారు ఉద్యోగం, వ్యాపారాలకు సంబంధించిన పత్రాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవడం మంచిది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. చిన్న వ్యాపారాలు నిర్వహించే వారికి ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి కామేశ్వరి స్తుతిని పారాయణం చేయడం శుభప్రదమని చెబుతున్నారు.
కుంభ రాశి వారు షేర్ మార్కెట్, సాఫ్ట్వేర్ వంటి రంగాలకు సంబంధించిన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. సరైన ప్రణాళికతో వ్యవహరిస్తే ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. పరిచయాలు, నెట్వర్కింగ్ ద్వారా కొత్త అవకాశాలు లభించవచ్చు. ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకోవడం మంచిది. శ్రీ సౌభాగ్యదేవి అమ్మవారికి విశేష పుష్పార్చన చేయడం శ్రేయస్కరమని జ్యోతిష్య సూచన. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి.