Reading Time: < 1 minute

హైకోర్టుకు తిరిగి జస్టిస్ వినోద్‌‌‌‌‌‌‌‌ కుమార్..మద్రాస్ హైకోర్టు నుంచి బదిలీ

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తడకమల్ల వినోద్‌‌‌‌‌‌‌‌కుమార్ తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు. గత ఏడాది జులైలో తెలంగాణ హైకోర్టు నుంచి మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయిన ఆయన తిరిగి రాష్ట్ర హైకోర్టుకు రానున్నారు. ఈ నెల 14న మొదటి కోర్టు హాలులో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

నల్గొండ జిల్లాకు చెందిన లక్ష్మీనరసింహ, శకుంతల దంపతులకు 1964, నవంబర్ 17న జస్టిస్ వినోద్‌‌‌‌‌‌‌‌కుమార్ జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టా పొందిన ఆయన1988లో బార్ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 2019, ఆగస్టు 26న హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం 2025లో మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. తాజా బదిలీతో తిరిగి తెలంగాణ హైకోర్టులో బాధ్యతలు చేపట్టనున్నారు.

©️ VIL Media Pvt Ltd.