Reading Time: 2 minutes
Bigg Boss 10 Telugu : ప్రేమ పక్షులను ఏకిపారేసిన నరేష్.. రోహిత్ రొట్టగ్యాంగ్ అన్న త్రిగుణ్.. ఆరోవారం ఎవరెవరు నామినేట్ అయ్యారంటే..

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ఆరో వారం నామినేషన్ల పర్వం హౌస్‌లో రసవత్తరంగా సాగింది. మిగతా రోజుల్లో ఆట ఎలా ఉన్నా, నామినేషన్ల సమయంలో హౌస్‌మేట్స్ మధ్య హీట్ మామూలుగా ఉండదన్న సంగతి తెలిసిందే. అందుకే చాలా మంది నామినేషన్స్ ఎపిసోడ్, అలాగే శనివారం ఎపిసోడ్ అస్సలు మిస్ అవ్వకుండా చూస్తారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో రోహిత్, షాలినిల తీరు, వైల్డ్ కార్డ్ ఎంట్రీల హడావుడితో హౌస్ రణరంగంగా మారింది. ఒకరి నామినేషన్‌లో మరొకరు జోక్యం చేసుకోవడం, దోస్తుల కోసం అనవసరమైన విషయాల్లో దూరిపోయి మరీ వాధించడం ప్రేక్షకులకే చిరాకు పుట్టించించింది. ముఖ్యంగా మన ప్రేమపక్షులు షాలిని, రోహిత్ బిహేవియర్ మాత్రం నిన్నటి ఎపిసోడ్ లో మరింత చిరాకు పుటించిందని తిట్టిపోస్తున్నారు నెటిజన్స్. ఈ నామినేషన్ల ప్రక్రియలో కంటెస్టెంట్ల ఆటతీరుపై తోటి సభ్యులు తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా హౌస్‌లో జరిగిన గొడవలు, వ్యూహాల మధ్య కొందరు కంటెస్టెంట్లు విమర్శలను ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో నామినేషన్స్ సందర్భంగా హౌస్‌మేట్ నరేష్ మాట్లాడిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది.

ముందుగా షాలిని వచ్చి యాంకర్ వర్షిణిని నామినేట్ చేసింది. ఆమెకు అసలు మానవత్వమే లేదని.. సృష్టి పళ్లు రాలగొడతా అన్నందుకు తనను చూస్తే భయం వేస్తుందని మాట్లాడిన తీరు తనకు నచ్చలేదని తెలిపింది. త్రవాత ముకేష్ ను నామినేట్ చేసి దమ్ము ఉండాలి అన్నావ్. మనుషులను చీడ పురుగులు చూసినట్టు చూస్తావు అని చెప్పుకచ్చింది. ఇక వర్షిణి, షాలిని గొడవ పడుతుంటే మధ్యలోకి దూరిపోయారు రోహిత్, త్రిగుణ్ ఇద్దరూ. బుద్దిలేదు, జ్ఞానం లేదంటూ వీధి రౌడీల్లా రెచ్చిపోయారు. తర్వాత త్రిగుణ్ తో మాట్లాడినందుకు కాళ్లు మొక్కించుకున్నాడు రోహిత్. ఇక తర్వాత దేబ్జానీ వచ్చి షాలినీని నామినేట్ చేసింది. అప్పుడు కూడా మధ్యలోకి రోహిత్ రావడంతో ఇచ్చిపడేసింది దెబ్జానీ. దీంతో మనోడు సైలెంట్ అయిపోయాడు. తర్వాత రాంప్రసాద్ ను దేబ్జానీ నామినేట్ చేయడంతో వైల్డ్ కార్డ్స్ అంతా ఒక మాట అనుకుని వచ్చి కావాలనే నామినేట్ చేస్తున్నారని షాలిని అనడంతో ఆట అంతా చూసి వచ్చామని కౌంటరిచ్చాడు శివ్.

దీంతో మధ్యలోకి రోహిత్ దూరిపోగా.. అనుహ్యంగా రోహిత్ వర్సెస్ వంశీగా మారింది. ఇద్దరూ ఒకరి మొహంలోకి ఒకరు చూసుకుంటూ గట్టిగా అరుచుకున్నారు. తర్వాత వంశీ వచ్చి షాలినిని నామినేట్ చేస్తూ మనుషులను హీనంగా చూడొద్దని అన్నాడు. పదే పదే ఎఫ్ వర్డ్ మాట్లాడుతున్నావ్ అని.. దీంతో హౌస్ వాతావరణం దెబ్బతింటుందని చెప్పాడు. అలాగే విలువైన అన్నాన్ని పడేస్తున్నారు. ఫుడ్ వేస్ట్ చేస్తున్నారని చెప్పాడు వంశీ. అప్పుడు కూడా షాలిని యాటిట్యూడ్ చూపించింది. తర్వాత ముకేష్ ను వంశీ నామినేట్ చేయగా.. వాలిడ్ పాయింట్స్ ఎక్కువగా ఉండడంతో షాలిని నామినేషన్ ఓకే చేశాడు ఆర్కే. ఇక తర్వాత కూడా మళ్లీ ఎప్పటిలాగే ఫుడ్ వేస్ట్ చేశారు మన ప్రేమజంట. త్రిగుణ్ వచ్చి రోహిత్ ను నామినేట్ చేస్తూ తన ఫ్యామిలీ గురించి మాట్లొద్దని చెప్పాడు. అయినా రోహిత్ మళ్లీ మళ్లీ త్రిగుణ్ పాప గురించి తీయడంతో గొడవ మొదలయ్యింది.

తర్వాత నరేష్ వచ్చి ఒక్క ప్రశ్నతో రోహిత్, షాలినిలకు చుక్కలు చూపించాడు. నరేష్ కేవలం గొడవలకు దిగకుండా, రోహిత్ , షాలిని ప్రవర్తనను టార్గెట్ చేస్తూ సూటి ప్రశ్నలతో సూటిగా నిలదీశారు. దీంతో దెబ్బకు నోరు మూసుకున్నారు మన ప్రేమపక్షులు. వరుసగా గేమ్స్ ఆడి గెలిచాను కాబట్టే ఇక్కడ నిలబడ్డాను అంటూ స్టార్ట్ చేసిన నరేష్.. చరణ్ ను ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు. డిస్కరేజ్ చేయొద్దని అన్నావు. మరీ నువ్వెందుకు చరణ్ కు సపోర్ట్ చేస్తూ ఓటు వేయలేదని సూటిగా రోహిత్ ను అడిగాడు నరేష్. దీంతో సోదీ చెబుతూ కవర్ చేసుకోబోయాడు రోహిత్. ఇక ఈ వారం నామినేషన్ల వంశీ, వర్షిణి, రోహిత్, షాలిని, అమన్‌లతో రాం ప్రసాద్ ఉన్నారని చెప్పాడు బిగ్ బాస్.