
- జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జయలక్ష్మి
కొండగట్టు, వెలుగు: సాంకేతిక విద్యలో జగిత్యాల జేఎన్టీయూ కళాశాలను హైదరాబాద్ ప్రధాన క్యాంపస్కు దీటుగా తీర్చిదిద్దుతున్నామని జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జయలక్ష్మి తెలిపారు. మంగళవారం జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జగిత్యాల క్యాంపస్కు యూనివర్సిటీ హోదా కల్పించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, త్వరలోనే ఎంబీఏ వంటి కొత్త కోర్సులను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు.
అధునిక వసతులు, నాణ్యమైన విద్యతో ఉత్తర తెలంగాణ విద్యార్థులకు మరిన్ని అవకాశాలు కల్పించనున్నట్టు చెప్పారు. జగిత్యాల జేఎన్టీయూకు ఇప్పటికే న్యాక్, ఎన్బీఏ గుర్తింపు లభించాయని తెలిపారు.