Reading Time: < 1 minute

బీహార్‎లో ఘోర ప్రమాదం.. గంగా నదిలో పడవ బోల్తా.. 11 మంది మృతి..!

Caption of Image.

పాట్నా: బీహార్‎లో ఘోర ప్రమాదం జరిగింది. గంగా నదిలో పడవ బోల్తా పడింది. బీహార్ ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ అసెంబ్లీ నియోజకవర్గమైన రాఘోపూర్‌లోని రాంపూర్ గ్రామ సమీపంలో మంగళవారం (అక్టోబర్ 13) రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది మరణించినట్లు సమాచారం. ప్రమాద సమయంలో బోట్‎లో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

వీరంతా ఒక విందు కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్య్కూ టీమ్స్ హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. జిల్లా పోలీసు అధికారులు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్‌డిఆర్‌ఎఫ్) బృందం రెస్య్కూ ఆపరేషన్ చేపట్టింది. నీటిలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడటంతో సహయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. 

సహయక  చర్యలు వేగవంతం చేయండి: తేజస్వీ యాదవ్

రాఘోపూర్‌ నియోజకవర్గ పరిధిలోని రాంపూర్ గ్రామ సమీపంలో  పడవ బోల్తా పడిన ఘటనపై ఎమ్మెల్యే తేజస్వీ యాదవ్ స్పందించారు. రాఘోపూర్‌లోని దియారా ప్రాంతంలో పడవ బోల్తా పడిందని తెలిపారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు మరణించగా.. మృతుల్లో ఎక్కువ మంది పిల్లలేనని చెప్పారు. ఘటన స్థలంలో సహాయక, పునరావాస చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

►ALSO READ | ఉత్తరాఖండ్లో ఏడాది పాటు గుట్కా, పాన్ మసాలా అమ్మకాలపై నిషేధం.. తయారీపై కూడా..

©️ VIL Media Pvt Ltd.