Reading Time: < 1 minute

డబుల్ ధమాకా: ఒకేరోజు తగ్గిన బంగారం, వెండి రేట్లు.. హైదరాబాదులో గ్రాము ఎంతంటే?

Caption of Image.

దసరా దీపావళి దగ్గరలోనే ఉంది. ఇప్పటికే మార్కెట్లో చాలా గోల్డ్ షాపు యజమానులు పండుగల ఆఫర్స్ కూడా విడుదల చేశారు. ఈ క్రమంలో బంగారం రేట్లతో పాటు వెండి కూడా తగ్గటం కొనుగోలుదారులకు పెద్ద ఊరటగా నిలుస్తోంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు దీనిని సధ్వినియోగం చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ముందుగా వివిధ నగరాల్లో తగ్గిన ధరలను పరిశీలించటం మంచిది. 

అక్టోబర్ 13న బంగారం రేట్లు తగ్గాయి. దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.39 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 929గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 685గా కొనసాగుతోంది. 

మంగళవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. అక్టోబర్ 13, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.5వేలు తగ్గింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కూడా స్వచ్ఛమైన వెండి కేజీ రూ.2లక్షల 45వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.245 దగ్గర ఉంది.

©️ VIL Media Pvt Ltd.