Reading Time: < 1 minute

ఢిల్లీని జైలుగా మార్చేశారు.. జ్ఞానేశ్ రాజీనామా చేసే వరకు పోరాటం ఆగదు: రాహుల్

Caption of Image.

న్యూఢిల్లీ: సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యువత, ప్రతిపక్షాలు నిరసన చేపడితే పోలీసులు ఢిల్లీలో భయానక వాతావరణం సృష్టించారని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ అపొజిషన్ లీడర్ రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. ఢిల్లీలో బస్సులు, మెట్రో, రైళ్లును నిలిపివేసి ప్రజారవాణా వ్యవస్థను ఎక్కడికక్కడ స్తంభింపజేశారని మండిపడ్డారు. 

ఎమర్జెన్సీ తరహాలో రోడ్లపై సుమారు 30 వేల మంది పోలీసులను మోహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీని జైలుగా మార్చి.. ఎక్కడా ఆందోళన తెలిపిన అరెస్ట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిరసనలో పాల్గొన్న యువతపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ గుండాలు దాడులు చేశారని ఆరోపించారు. పోలీసులు విపక్ష నేతలను అడ్డుకుని.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ గుండాలకు యధేచ్ఛగా వదిలేశారని మండిపడ్డారు. 

సర్ ప్రక్రియలో అక్రమాలు, సీఈసీ జ్ఞానేష్ కుమార్‎ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఉద్యమం ఉధృతం చేసింది. ఇందులో భాగంగానే సోమవారం (అక్టోబర్ 12) సుప్రీంకోర్ట్ వరకు భారీ శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చింది. ఈ ర్యాలీకి ముందు కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేయడంతో పాటు ఢిల్లీ పోలీసుల వ్యవహరిస్తోన్న తీరును రాహుల్ గాంధీ వివరించారు. 

ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. సర్ పేరుతో దేశంలో ఓట్ చోరీ జరుగుతోందన్నారు. సర్‎కు వ్యతిరేకంగా దేశంలో ప్రజా ఉద్యమం మొదలైందని తెలిపారు. సర్ పక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఎందుకు రాజీనామా చేయట్లేదని ప్రశ్నించారు. 

జ్ఞానేష్ కుమార్‎ను ప్రధాని మోడీ ఎందుకు కాపాడుతున్నారని నిలదీశారు. దేశ ప్రజలంతా ఒకవైపు ఉన్నరు.. ప్రధాని మోడీ, అమిత్ షా, జ్ఞానేష్ కుమార్ ఒక వైపు ఉన్నారన్నారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. దేశంలో ప్రజా స్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుతామని పేర్కొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.