
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ మంచి భోజన ప్రియుడన్న సంగతి అందరికి తెలిసిందే. ఆయన తినడమే కాదు, ఆయనతో పాటుగా ఉండేవారికి కూడా రుచికరమైన వంటకాలు అందిస్తుంటారు డార్లింగ్. ముఖ్యంగా ఆయనతో పని చేసే నటీనటులకు ఇంటి నుంచి మంచి రుచికరమైన భోజనం తినిపిస్తారు. ఒకటి కాదు.. రెండు కాదు.. లెక్కలేనన్నీ వెరైటీలతో నాన్ వెజ్ వంటకాలు, స్వీట్స్.. ఇలా ఎన్నో రకాల ఫుడ్ ఐటమ్స్ సెట్ కు తీసుకొచ్చి మరీ అందరికీ తినిపిస్తుంటారు. అందుకే ప్రభాస్ ఆతిధ్యం గురించి సినిమా ఇండస్ట్రీలో ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్.. ఇలా అన్ని రకాల ఇండస్ట్రీల హీరోలు, హీరయిన్లు, యాక్టర్స్ ప్రభాస్ ఆతిథ్యం రుచి చూసిన వారే. ఇప్పుడు తాజాగా తన రుచికరమైన విందుతో హీరోయిన్ ఇమాన్విని సర్ప్రైజ్ చేశారు ప్రభాస్.