Reading Time: < 1 minute

Parichayame: ప్రేమికులుగా మారిన స్నేహితులు.. మనసు దోచుకుంటున్న ‘గోల్డ్ స్పాట్’ మెలొడీ

Caption of Image.

అభిషేక్, కాజల్ చౌదరి  జంటగా వేణు కార్తికేయన్ దర్శకత్వంలో రవితేజ పచ్చిపాల నిర్మిస్తున్న చిత్రం ‘గోల్డ్ స్పాట్’.  ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ ఫేమ్   దుష్యంత్ కటికనేని  కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు. సోమవారం ఈ చిత్రం నుంచి ‘పరిచయమే’ అంటూ సాగే  ఫస్ట్ సాంగ్‌‌‌‌ను రిలీజ్ చేశారు.

ఈ మెలొడీని మ్యూజిక్ డైరెక్టర్ నరేన్ రెడ్డి కంపోజ్ చేసి సింగర్ తుషార నిలయతో కలిసి పాడాడు. భార్గవ కార్తీక్ క్యాచీ లిరిక్స్ అందించాడు. ‘ఓ మనసా అలుపే రాదు తలపున నీవుంటే, ఓ మనసా అదుపే లేదు ఎదురుగ నీవుంటే, వేల వర్ణాల ఆమనిగా, పూల గంధాల పుష్యమిగా, పరిచయమే చిరు కథగా మొదలవగా, పరిణయమే తదుపరిగా మిగిలెనుగా, పరిచయమే చిరు కథగా మొదలవగా, పరిణయమే తదుపరిగా మిగిలెనుగా..’ అంటూ ప్రేమికులవుతున్న చిన్ననాటి స్నేహితులు రామ్, శాంత మధ్య స్వీట్ మెలొడీగా చిత్రీకరించిన ఈ పాట ఆకట్టుకుంటోంది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌‌‌‌ను అనౌన్స్ చేయనున్నారు. 

©️ VIL Media Pvt Ltd.