
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు విశాఖ నక్షత్రంలో సంచరించేటప్పుడు.. అది మరింత శక్తివంతమై అదనపు ప్రయోజనాలను ఇస్తుంది. అక్టోబర్ 12న బుధుడు విశాఖ నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. డిసెంబర్ 4 వరకు ఈ నక్షత్రంలో సంచరిస్తాడు. బుధుడు విశాఖ నక్షత్రంలో సంచరించే ఈ కాలం కొన్ని రాశుల వారికి పురోగతిని, కొత్త అవకాశాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం. . .!
మేష రాశి: ఈ రాశికి బుధుడు 7వ ఇంట్లోకి బుధుడు తులారాశి ద్వారా విశాఖ నక్షత్రంలో సంచరిస్తాడు. దీని వలన వ్యాపారాలు బలపడుతాయి. కొత్తగా కీలక అగ్రమెంట్లు చేసుకొనే అవకాశం ఉంది. చేతి వృత్తి వారికి అనుకోకుండా ఆర్డర్లు వస్తాయి. ఉద్యోగస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. కొత్త ప్రణాళికల విషయంలో జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలిసి వస్తాయి.
పరిహారం: బుధవారం బుధుడిని ధ్యానించడం.. పచ్చని వస్తువులు దానం
వృషభ రాశి: ఈ రాశిలోకి అక్టోబర్ 12న బుధుడు.. కన్యారాశి ద్వారా విశాఖ నక్షత్రం 6వ ఇంటిలోకి ప్రవేశిస్తాడు. దీని వలన ఆరోగ్య విషయంలో జాగత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు. పని ఒత్తిడి పెరుగుతుంది. అప్పులు చేయాల్సి వస్తుంది. ఒకేసారి అనేక పనులు చేయవలసి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులు అనవసరమైన విషయాల జోలికి వెళ్లవద్దు. వ్యాపారాలు సజావుగా సాగినా.. బుధుడు వ్యయ స్థానంలో ఉండటం వలన ఖర్చులు పెరుగుతాయి. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలను కొన్ని రోజుల పాటు వాయిదా వేయాలని పండితులు చెబుతున్నారు.
పరిహారం: బుధవారాల్లో పక్షులకు పచ్చి ధాన్యాన్ని ఆహారంగా ఇవ్వండి..
మిథునరాశి: బుధుడు ఈ రాశి 5వ ఇంటిలోకి సింహ రాశి ద్వారా విశాఖ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు.ఈ ప్రభావం వలన విద్య, తెలివితేటలు, పిల్లలు కళలకు సంబంధించిన రంగాల్లో కీలక మార్పులు జరిగే అవకాశం ఉంది. . విద్యార్థులలో ఏకాగ్రత మెరుగుపడుతుంది. ఈ రాశి వారు కొత్త ఆలోచనలు వస్తాయి. అదనపు ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండాలని పండితులు చెబుతున్నారు. ఉద్యోగస్తులకు వ్యాపారులకు ఎలాంటి ఇబ్బంది ఉందడదు.
పరిహారం: బుధవారం గణేశుడిని పూజించి, దూర్వా (పొద్దుతిరుగుడు పువ్వు) సమర్పించండి.
కర్కాటకరాశి : బుధుడు ఈ రాశి 4వ ఇంట్లో విశాఖ నక్షత్రంలోకి సంచరిస్తాడని పండితులు చెబుతున్నారు. ఈ ప్రభావం వలన ఇల్లు, కుటుంబం, భూమి , వాహనాలకు సంబంధించి కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. ఆస్తి విషయంలో జరిగిన మార్పులు వలన మనశ్శాంతి కలిగే అవకాశం ఉంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. కొత్త వస్తువుల కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని పండితులు చెబుతున్నారు.
పరిహారం: బుధవారం బియ్యం లేదా తెల్లని వస్తువులు దానం
సింహ రాశి: బుధుడు ఈ రాశి 3వ ఇంట్లోకి మిథున రాశి ద్వారా విశాఖ నక్షత్రంలో సంచారం జరుగుతుంది. దీనివలన సమాజంలో గౌరవ మర్యాదలు బలపడతాయి. కొత్త ప్రాజెక్ట్‌లను ప్రారంభించడం సులభతరం అవుతుంది. వ్యాపారస్తులకు గణనీయమైన ప్రయోజనాలుంటాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. ఉద్యోగస్తులు ఆఫీసులో కీలక పాత్ర పోషిస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు పొందుతారు. ఈ రాశి వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
పరిహారం: బుధవారం గణేశుడికి మోదకాలు , గరిక సమర్పించాలి. గోమాతకు పచ్చి మేత ఆహారంగా ఇవ్వాలి.
కన్యారాశి: ఆ రాశికి అధిపతి అయిన బుధుడు 2వ ఇంట్లో విశాఖ నక్షత్రంలోకి వృషభ రాశి ద్వారా ప్రవేశిస్తాడు. ఈ ప్రభావం వలన ఈ రాశి వారికి సంపద, పొదుపు, విషయాల్లో కీలక మార్పులు జరుగుతాయి. ఆదాయం పెరిగేందుకు పరిస్థితులు అనుకూలిస్తాయి. ఏ విషయాన్నైనా దీర్ఘంగా ఆలోచించవద్దని పండితులు చెబుతున్నారు. ఉద్యోగులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు అధికంగా లాభాలుంటాయి. ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది.
పరిహారం: బుధవారం పెసరపప్పు దానం
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.