Reading Time: 2 minutes

మారనున్న ధారావి రూపరేఖలు: 22 ఎకరాల్లో 10 వేలకు పైగా ఇళ్ల నిర్మాణం షురూ

Caption of Image.

ముంబై: ఆసియాలోనే అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన ముంబై సిటీలోని ధారావిలో పునరాభివృద్ధి ప్రాజెక్టు స్టార్ట్ అయ్యింది. ధారావి మురికివాడ నివాసితుల కోసం అదానీ గ్రూప్ పునరావాస గృహ నిర్మాణ పనులను షురూ చేసింది. ఇందులో భాగంగా 2026, అక్టోబర్ 12న మాతుంగాలోని 22 ఎకరాల రైల్వే స్థలంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ డైరెక్టర్ ప్రణవ్ అదానీ శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించి ప్రాజెక్ట్‎ను అధికారికంగా ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ప్రతి కుటుంబానికి తాము సురక్షితంగా భావించే, భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకోగలిగే ఇల్లు ఉండాలి. ధారావి కుటుంబాలకు దీని ప్రాముఖ్యత ఏమిటో మాకు తెలుసు. మటుంగాలో మేము 10,432 గృహాలు, 1,379 వాణిజ్య, పారిశ్రామిక యూనిట్లతో మొత్తం 10 టవర్లను నిర్మిస్తున్నాము. తద్వారా ధారావి కుటుంబాలు మెరుగ్గా జీవించి, తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోగలిగే నివాస ప్రాంతాలను సృష్టిస్తున్నాము’’ అని పేర్కొన్నారు. 

ఈ ప్రాజెక్ట్‎లో భాగంగా మొత్తం 10 భారీ టవర్లను మూడు దశల్లో నిర్మించనున్నారు. తొలి దశలో ఐదు, రెండో దశలో రెండు, మూడో దశలో మూడు టవర్లు నిర్మించనున్నారు. మొదటి ఐదింటిని 2029 మార్చి నాటికి, తర్వాతి రెండింటిని 2029 ఆగస్టు నాటికి, మిగిలిన మూడింటిని 2030 ఆగస్టు నాటికి అప్పగించనున్నట్లు కంపెనీ తెలిపింది.

►ALSO READ | 14 ఏళ్ల పోరాటం.. BMW కార్ ఓనర్కు ఇన్సురెన్స్ కంపెనీ నుంచి రూ.70 లక్షలు

ఇందులో 10, 432 అపార్ట్‌మెంట్లు అర్హులైన ధారావి వాసులకు ఇవ్వనున్నారు. అలాగే 1,379 వాణిజ్య, పారిశ్రామిక యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. ధారావి వాసులకు అందించే ప్రతి ఇల్లు 350 చదరపు అడుగుల వైశాల్యం, ఆధునిక వసతులతో నిర్మించనున్నారు. వీటితో పాటు కమ్యూనిటీ హాళ్లు, ఉద్యానవనాలు, కిండర్ గార్టెన్లు వంటి మరిన్ని పౌర వసతులను కల్పిస్తున్నారు. 

అపార్ట్మెంట్లను లబ్ధిదారులకు అందజేసిన తర్వాత 10 కూడా 10 ఏళ్ల పాటు అదానీ నవభారత్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ భవనాల మరియు ఉమ్మడి మౌలిక సదుపాయాల నిర్వహణ బాధ్యతను చూసుకుంటుంది. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడల్లో ఒకటిగా పేరొందిన ధారావి నివాసితులకు సురక్షితమైన, గౌరవప్రదమైన ఆధునిక జీవన ప్రమాణాలను అందించే దిశగా ఈ పునరావాస గృహాల నిర్మాణం ఒక ప్రధాన మైలురాయిగా నిలవనుంది. ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ అఫిషియల్ గా ప్రారంభం కావడంతో ధారావి మురికివాడ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

©️ VIL Media Pvt Ltd.