
శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు డీఆర్ఐ అధికారులు. మంగళవారం ( అక్టోబర్ 13 ) బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ప్రయాణికుడి దగ్గర భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఎలక్ట్రిక్ గీజర్ లో దాచిన 7.750 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. పట్టుబడ్డ గంజాయి విలువ రూ.2.71 కోట్లు ఉంటుందని తెలిపారు అధికారులు.
ముందస్తు సమాచారంతో ఎయిర్ పోర్టులో తనిఖీలు నిర్వహించిన అధికారులు ప్రయాణికుడి చెక్ ఇన్ బ్యాగేజిలో ఎలక్ట్రిక్ గీజర్ గుర్తించామని తెలిపారు. గీజర్ ను తెరిచి పరిశీలించగా 73 ప్యాకెట్లలో గంజాయి ఉందని తెలిపారు అధికారులు.
అంతర్జాతీయ అక్రమ మార్కెట్‌లో గంజాయి విలువ సుమారు రూ.2.71 కోట్లు ఉంటుందని తెలిపారు అధికారులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు అధికారులు.