Reading Time: 2 minutes

అమెజాన్ ఫెస్టివల్‌ సేల్‌.. సగం ధరకే 5G స్మార్ట్ ఫోన్స్.. వన్‌ప్లస్ నుండి రెడ్ మీ వరకు రూ.20వేలలోపే..

Caption of Image.

ఇ-కామర్స్ కంపెనీ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ వచ్చేసింది!  ఈ దసరా ఫెస్టివల్ సీజన్లలో కొత్త స్మార్ట్ ఫోన్ కోనాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం. ఎందుకంటే ఐకూ (iQOO), రెడ్‌మి, వన్‌ప్లస్, శాంసంగ్ లాంటి టాప్  బ్రాండ్ల ఫోన్లపై భారీ డిస్కౌంట్లు తీసుకొచ్చింది. దింతో బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్ అన్నీ కలిపి అతితక్కువ ధరకే మంచి 5g ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.

రూ. 20వేలలోపు టాపెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇవే:
*iQOO Z11 Lite 5G దీని అసలు ధర రూ. 33,999 అయితే, అఫర్ సేల్‌లో కేవలం రూ. 19,497కే వస్తోంది. మంచి పర్ఫార్మెన్స్ ఫోన్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.

*రూ. 29,999 విలువైన వన్‌ప్లస్ N6x  ఈ ఫోన్ ఇప్పుడు కేవలం రూ. 19,999కే లభిస్తోంది. తక్కువ బడ్జెట్‌లో వన్‌ప్లస్  కావాలనుకునే వారికి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు.

*శాంసంగ్ గెలాక్సీ M17e 5G ఫోన్  డిస్‌ప్లే, సాఫ్ట్‌వేర్ నమ్మకానికి మంచి పొందింది. గతంలో రూ. 19,999 ఉన్న ఈ ఫోన్ ఇప్పుడు రూ. 16,998కే కొనొచ్చు.

*వన్‌ప్లస్ N6 లైట్… రూ. 24,999 ధర ఉన్న ఈ మోడల్ ఇప్పుడు రూ. 15,999కే దొరుకుతోంది.

*రెడ్‌మి 15C 5G ప్రైమ్ ఎడిషన్ రూ. 29,999 ఉండే ఈ ఫోన్‌పై భారీ తగ్గింపు ఇస్తూ కేవలం రూ. 15,999కే మీ సొంతం చేసుకోవచ్చు.

*రెడ్‌మి A7 ప్రో 5G అనేది రూ.15వేలలోపు బడ్జెట్‌లో ఫోన్ కావాలనుకునేవారికి ఇది చక్కటి ఆప్షన్. దీని ధర రూ. 26,999 నుండి తగ్గి ప్రస్తుతం రూ.14,497కే లభిస్తోంది.

ఇంకా ఎక్కువ డబ్బులు ఆదా చేసుకావాలంటే 
*బ్యాంక్ ఆఫర్లు కింద ఎస్‌బీఐ (SBI) కార్డ్ ఉపయోగిస్తే 10% వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.

*ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా మీ పాత ఫోన్‌ను మార్చుకుంటే ధర మరింత తగ్గుతుంది.

*ఇతర సదుపాయాలలో నో-కాస్ట్ ఈఎంఐ (No-cost EMI) ఆప్షన్లు, కొన్ని ప్రత్యేక మోడళ్లపై కూపన్ డిస్కౌంట్లు, అమెజాన్ పే ద్వారా క్యాష్‌బ్యాక్ లాంటి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.

కొనేముందు ముఖ్యమైన విషయాలు
*ఫైనల్ ప్రైస్ చెక్ : బ్యాంక్ ఆఫర్లు, కూపన్లు అన్నీటి తర్వాత చివరి ధర ఎంత పడుతుందో ఒకసారి చూసుకోండి.

*ఆన్‌లైన్‌లో ధరలు ఎప్పుడూ మారుతుంటాయి కాబట్టి, ఆర్డర్ చేసే ముందు ఆ సమయంలో ఉన్న రేటును, ఫీచర్లను ఒకసారి గమనించండి.

*చివరగా ఆఫర్లకు సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్‌ను ఒకసారి చదవడం మంచిది.

©️ VIL Media Pvt Ltd.