Reading Time: < 1 minute

ఢిల్లీ క్యాపిటల్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌ కోచ్‌‌‌‌గా యువరాజ్‌‌‌‌ సింగ్

Caption of Image.

న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌‌‌–2027 సీజన్‌‌‌‌ కోసం ఢిల్లీ క్యాపిటల్‌‌‌‌ కీలక నియామకం చేపట్టింది. టీమిండియా మాజీ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ యువరాజ్‌‌‌‌ సింగ్‌‌‌‌ను తమ జట్టు అసిస్టెంట్‌‌‌‌ కమ్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌ కోచ్‌‌‌‌గా నియమించుకుంది. ఇండియా తరఫున 304 వన్డేలు, 40 టెస్ట్‌‌‌‌లు, 58 టీ20లు ఆడిన 44 ఏళ్ల యువరాజ్‌‌‌‌ పలు వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

ఇప్పటికే శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌, అభిషేక్‌‌‌‌ శర్మ, ప్రభ్‌‌‌‌సిమ్రన్‌‌‌‌ సింగ్‌‌‌‌ వంటి యంగ్‌‌‌‌ ప్లేయర్లకు మెంటార్‌‌‌‌గా వ్యవహరిస్తున్న యువీకి అధికారికంగా ఇదే తొలి కోచింగ్‌‌‌‌ బాధ్యతలు కావడం విశేషం. ఢిల్లీ ఫ్రాంచైజీతో తనకు పాత అనుబంధం ఉందని, యాజమాన్యంతో మంచి పరిచయం ఉండటంతో ఈ బాధ్యత ఎంతో ప్రత్యేకంగా నిలిచిందని యువరాజ్ తెలిపాడు.

సౌరవ్ గంగూలీతో కలిసి మరోసారి కోచ్‌‌‌‌లుగా కలిసి పనిచేయడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాడు. ప్రతిభావంతులైన ఆటగాళ్లతో కూడిన ఈ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. యువరాజ్ నియామకంతో ఢిల్లీ ఫ్రాంచైజీతో తన బంధం మళ్లీ ముడిపడింది. 2015 ఐపీఎల్ వేలంలో నాటి ఢిల్లీ డేర్‌‌‌‌డెవిల్స్ జట్టు యువరాజ్‌‌‌‌ను రికార్డు స్థాయిలో రూ.16 కోట్లకు కొనుగోలు చేసింది. 
 

©️ VIL Media Pvt Ltd.