Reading Time: 2 minutes

షాపింగ్, జాబ్స్, లాటరీ పేరుతో సైబర్ మోసాలు.. పోగొట్టుకున్న 67% మందికి తిరిగి డబ్బులు.. షాకింగ్ సర్వే !

Caption of Image.

భారత్‌లో ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆన్‌లైన్ షాపింగ్, ఉద్యోగాల పేరుతోనే కాకుండా గిఫ్ట్స్, లాటరీలు గెలుచుకున్నారంటూ చెప్పి కూడా సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారు. అయితే, మోసానికి గురైన వారు ఫిర్యాదులు చేస్తున్న, పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందడం మాత్రం కష్టంగానే మారుతోంది. తాజాగా విడుదలైన GSMA ‘ఇండియా కన్స్యూమర్ స్కామ్ రిపోర్ట్ 2026’లో ఈ విషయం వెల్లడైంది.

ఈ నివేదిక ప్రకారం, మోసానికి గురై డబ్బులు కోల్పోయిన వారిలో 67% మందికి  డబ్బు తిరిగి రాలేదు. అంతేకాదు, ఫిర్యాదు చేసిన కేసుల్లో 33% ఇంకా పరిష్కారం కాలేదు. మోసానికి గురైన వారిలో 86% మంది సహాయం కోసం కనీసం ఒక సంస్థనైనా సంప్రదించిన, ఆశించిన ఫలితం అందరికీ దక్కడం లేదు.

2026లో ఆన్‌లైన్ మోసాల పరిస్థితి ఏంటి?
ఈ నివేదికను మిల్యూ ఇన్‌సైట్ సంస్థ 2026 జూలై 29 నుంచి ఆగస్టు 3 వరకు నిర్వహించిన ఆన్‌లైన్ సర్వే ఆధారంగా రూపొందించారు. ఇందులో పాల్గొన్న భారతీయ వినియోగదారుల్లో 12% మంది గత 12 నెలల్లో  నేరుగా మోసానికి గురైనట్లు చెప్పారు. మరో 39% మంది   మోసపోకపోయినా, తమకు తెలిసినవారు ఇలాంటి మోసాల బారిన పడినట్లు వెల్లడించారు.

దీన్ని బట్టి ఆన్‌లైన్ మోసాలు వ్యక్తిగత సమస్యగానే కాకుండా, చాలామంది ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యగా మారుతున్నట్లు తెలుస్తోంది. ఫిర్యాదు చేసిన తర్వాత కూడా డబ్బు తిరిగి రాకపోవడం బాధితులకు మరింత ఇబ్బందిగా మారుతోంది.

ఎక్కువగా జరుగుతున్న మోసాలు ఇవే!
భారతీయ వినియోగదారులు ఎదుర్కొంటున్న మోసాల్లో ఆన్‌లైన్ షాపింగ్ మోసాలు మొదటి స్థానంలో ఉన్నాయి. సర్వేలో వెల్లడైన వివరాల ప్రకారం.. ఆన్‌లైన్ షాపింగ్ మోసాలు 33%, గిఫ్ట్స్, లాటరీలు, వారసత్వం పేరుతో మోసాలు 31%, ఉద్యోగాలు, లాభాలు   వస్తాయంటూ చేసే మోసాలు 30%, క్యూఆర్ కోడ్‌లు, పేమెంట్ లింకుల ద్వారా మోసాలు 27%.

ఆన్‌లైన్‌లో వస్తువులు ఆర్డర్ చేసినా అవి రాకపోవడం, నకిలీ వెబ్‌సైట్ల ద్వారా డబ్బులు వసూలు చేయడం, ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ముందుగానే డబ్బులు అడగడం వంటి పద్ధతులతో మోసాలు జరిగే అవకాశం ఉంది. లాటరీ గెలిచారంటూ ఫోన్ చేసి, గిఫ్ట్ పొందాలంటే ముందుగా డబ్బులు చెల్లించాలని చెప్పడం కూడా మోసగాళ్లు ఉపయోగించే పద్ధతుల్లో ఒకటి.

వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా 
సైబర్ నేరగాళ్లు ప్రజలను సంప్రదించడానికి ఎక్కువగా మెసేజింగ్ యాప్స్ ఉపయోగిస్తున్నట్లు నివేదికలో వెల్లడైంది.  వీటిలో  మెసేజింగ్ యాప్‌లు 42%, సోషల్ మీడియా 37%, ఈమెయిల్ 33%…. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజులు, అనుమానాస్పద లింకులు, ఆకర్షణీయమైన ఆఫర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా డబ్బులు గెలుచుకున్నారని లేదా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్పే మెసేజులను వెంటనే నమ్మకూడదు.

ఏఐతో మోసాలు..  
ఇప్పుడు సైబర్ నేరగాళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నట్లు నివేదిక చెబుతోంది. సర్వేలో పాల్గొన్న భారతీయ వినియోగదారుల్లో 89% మంది మోసాల్లో ఏఐ వినియోగాన్ని గమనించినట్లు తెలిపారు. వారిలో 48% మంది ఏఐతో క్రియేట్  చేసిన మెసేజులు లేదా నకిలీ ఫోటోలు గుర్తించగా, 42% మంది నిజమైన వ్యక్తుల్లా కనిపించే డీప్‌ఫేక్ వీడియోలను చూసినట్లు చెప్పారు.

దీంతో కేవలం మెసేజ్ లేదా వీడియో చూసి అది నిజమని నమ్మడం ప్రమాదకరంగా మారుతోంది. తెలిసిన వ్యక్తి గొంతుతో ఫోన్ చేసినా, వీడియో పంపినా, డబ్బులు పంపే ముందుగా నిజమో కాదో కన్ఫర్మ్ చేసుకోవడం మంచిది.

మోసపోతే ఎవరిని సంప్రదిస్తున్నారు?
మోసానికి గురైన భారతీయుల్లో చాలామంది పోలీసులను, బ్యాంకులను ఆశ్రయిస్తున్నట్లు సర్వే వెల్లడించింది. ఇందులో  49% మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. 41% మంది  బ్యాంకు లేదా ఈ-వాలెట్ సంస్థను సంప్రదించారు. 40% మంది మోసం జరిగిన డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌కు ఫిర్యాదు చేశారు. 36% మంది మొబైల్ లేదా ఇంటర్నెట్ సేవల సంస్థలను సంప్రదించారు.

అయితే, ఫిర్యాదు చేయడం మాత్రమే సమస్యకు పరిష్కారం కావడం లేదు. ఒక సంస్థ కేసు పరిష్కారానికి బాధ్యత తీసుకున్న, డబ్బు తిరిగి వస్తుందని లేదా కేసు పరిష్కారామవుతుందని కాదు.

భారత్‌లో ఆన్‌లైన్ మోసాలపై ప్రజలు ఫిర్యాదు చేస్తున్న.. పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందడంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయని ఈ రిపోర్ట్  సూచిస్తోంది. ముఖ్యంగా షాపింగ్, ఉద్యోగాలు, లాటరీలు, ఏఐ ద్వారా మోసాల విషయంలో జాగ్రత్తగా  ఉండాలని హెచ్చరిస్తుంది. తెలియని లింకులను క్లిక్ చేయకుండా, ప్రతి పేమెంట్  ఒకటికి రెండుసార్లు కన్ఫర్మ్ చేసుకుంటే ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉంటుంది.

ఎవరైనా ఆన్‌లైన్  మోసానికి గురైతే వెంటనే మీ బ్యాంకుని సంప్రదించడం లేదా భారత సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేయండి లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయండి.
 

©️ VIL Media Pvt Ltd.