Reading Time: 2 minutes
కల్కి 2లో హీరోయిన్‌గా ఆ క్రేజీ బ్యూటీ.. దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్

రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఆయన నటిస్తున్న స్పిరిట్, కల్కి 2898 ఏడీ సీక్వెల్ సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెకు సంబంధించి వస్తున్న వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా ఆమె స్థానంలో మరో హీరోయిన్ నటించనున్నారనే ప్రచారం ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపికా పదుకొణె పేరు వినిపించింది. అయితే కొన్ని కారణాలతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆమె స్థానంలో బాలీవుడ్ నటి తృప్తి దిమ్రీని కథానాయికగా ఎంపిక చేసినట్లు ప్రచారం జరిగింది.

దీపికా పని గంటలు, పారితోషికం విషయంలో ఏర్పడిన విభేదాలే ఇందుకు కారణమని అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇదిలా ఉంటే, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందనున్న సినిమాలోనూ దీపికా పదుకొణె భాగం కావడం లేదనే వార్తలు తెరపైకి వచ్చాయి. తొలి భాగం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో దీపికా స్థానంలో ఎవరు నటిస్తారనే ప్రశ్న అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ముఖ్యంగా నటి సాయి పల్లవి పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. ప్రభాస్ సరసన ఆమె నటించనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే కల్కి 2లో దీపికా స్థానంలో సాయి పల్లవిని ఎంపిక చేసినట్లు ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు సాయి పల్లవి ప్రస్తుతం ‘రామాయణం’లో నటిస్తుంది. ఇప్పటికే ఏక్ దిన్ తోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది వచ్చింది. దాంతో ఆమెకు బాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ ఏర్పడింది. దాంతో తెలుగు, తమిళ్, హిందీ, మలయాళంలో కమంచి గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవిని కల్కిలో భాగం చేయాలని నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నారని ఇన్ సైడ్ టాక్. మరి ప్రభాస్ సినిమాలో ఆమెకు అవకాశం దక్కుతుందా.? లేక చిత్ర బృందం మరో హీరోయిన్‌ను ఎంపిక చేస్తుందా.? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

 

View this post on Instagram

 

A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.