Reading Time: < 1 minute

దసరా షాపర్లకు లక్కీ ఛాన్స్.. సోమవారం తగ్గిన బంగారం రేటు

Caption of Image.

దసరా పండుగల హడావిడి స్టార్ట్ అయ్యింది. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు పూజలు, వ్రతాలు, శుభకార్యాలకు బంగారం, వెండి కొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే గోల్డ్ రేట్లు కొద్దిగా తగ్గుముఖం పట్టడం ఆకట్టుకుంటోంది. దీనిని సధ్వినియోగం చేసుకుందా అనుకుంటున్న తెలుగోళ్లు ముందుగా తమ నగరాల్లోని రిటైల్ రేట్లను తెలుసుకోవటం మంచిది. 

అక్టోబర్ 12న బంగారం రేట్లు తగ్గాయి. దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.44 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 098గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 840గా కొనసాగుతోంది. 

సోమవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. అక్టోబర్ 12, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కూడా స్వచ్ఛమైన వెండి కేజీ రూ.2లక్షల 45వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.245 దగ్గర ఉంది.

©️ VIL Media Pvt Ltd.