Reading Time: < 1 minute
Viral News: రెస్టారెంట్‌లో కూర్చున్న అమ్మాయి దగ్గరకు వచ్చిన రోబో.. వెనక నుంచి ఏం చేసిందో తెలిస్తే..

పెరుగుతున్న టెక్నాలజీ వాడి కొందరు అద్భుతాలు సృష్టిస్తుంటే.. అదే టెక్నాలజీని ఉపయోగించి మరికొందరు నేరాలకు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే శనివారం10 అర్ధరాత్రి జర్మనీలోని కొలోన్ నగరంలో ఉన్న పామ్‌స్ట్రాస్సే ప్రాంతంలోని ఓ ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. 16 ఏళ్ల ఓ బాలిక రెస్టారెంట్‌లో ఫుడ్‌ తింటూ ఉండగా.. రెండ్ అండ్ గోల్డ్‌ కలర్‌లో దాదాపు 4 అడుగుల ఎత్తున్న ఓ హ్యూమనాయిడ్ రోబో ఆమె దగ్గరకు వచ్చింది. అంతటితో ఆగకుండా.. ఆ రోబో బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ, ఆమెను తాకుతూ అసభ్యకరమైన చేష్టలు చేసింది.

అయితే ఆ రోబోనూ రెస్టారెంట్‌కు కొద్ది దూరంలో పార్క్‌ చేసిన ఓ కారులో కూర్చున్న ఇద్దరు యువకులు రిమోట్ కంట్రోల్‌ ద్వారా ఆ రోబోను ఆపరేట్ చేస్తూ.. అందుకు సంబంధించిన వీడియోను టిక్‌టాక్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇందులో 19 ఏళ్ల యువకుడు ఈ దృశ్యాలను రికార్డ్ చేస్తూ ప్రసారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ వీడియో కాస్త వైరల్ అవ్వడంతో అప్రమత్తమైన పోలులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరు యువకులతో పాటు ఆ రోబోను సైతం స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడి సమయంలో ఆ రోబోకు వీడియోలో కనిపించిన స్లీవ్‌లెస్ వైట్ షర్ట్, స్వెట్‌ప్యాంట్స్, కళ్లద్దాలు తొడిగి ఉన్నట్టు గుర్తించారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. లైంగిక వేధింపులకు పాల్పడే ఉద్దేశంతోనే సదురు యువకులు రోబోను కంట్రోల్ చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.