
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ బౌలర్ల దెబ్బకు భారత జట్టు ఘోరంగా ఓడిపోయింది. విండీస్ నిర్దేశించిన 248 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా తడబడి, 24 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను వెస్టిండీస్ 2-2 తేడాతో సమం చేసింది. ఈ ఉత్కంఠభరిత పోరులో కీమో పాల్ ఐదు వికెట్లతో చెలరేగి భారత్ విజయానికి గండికొట్టగా, మ్యాచ్ మధ్యలో పేసర్ అర్షదీప్ సింగ్ గాయంతో రిటైర్డ్ హార్ట్ కావడంతో 19.3 ఓవర్లలోనే టీమిండియా ఆలౌట్ అయింది.
కీమో పాల్ వీరవిహారం:
248 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభమే ఇచ్చినా, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ముఖ్యంగా వెస్టిండీస్ బౌలర్ కీమో పాల్ టీమిండియా ఇన్నింగ్స్‌ను శాసించాడు. ఒకే ఓవర్లో నితీష్ కుమార్ రెడ్డి (41 పరుగులు), ప్రిన్స్ యాదవ్ (గోల్డెన్ డక్), అక్షర్ పటేల్ (3 పరుగులు)లను పెవిలియన్‌కు పంపి మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 5 వికెట్లు పడగొట్టి ఇండియా విజయావకాశాలను దెబ్బతీశాడు. ఆయనతో పాటు గుడకేష్ మోటీ 2 వికెట్లు తీసుకోగా, షామర్ స్ప్రింగర్, రొమారియ షెపర్డ్ తలో వికెట్ తీసుకుని భారత్‌ను కోలుకోలేని దెబ్బతీశారు.
పోరాడి ఓడిన భారత బ్యాటర్లు:
భారత జట్టు తరఫున సంజు శాంసన్, తెలుగు కుర్రాళ్లు తిలక్ వర్మ (43), నితీష్ కుమార్ రెడ్డి (41), అభిషేక్ శర్మ (29) పోరాడినప్పటికీ 248 పరుగుల లక్ష్యాన్ని మాత్రం చేరుకోలేకపోయారు. ముఖ్యంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (16), ఇషాన్ కిషన్ (6), నమన్ ధీర్ (0), అక్షర్ పటేల్ (3) బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమయ్యారు. దీనికి తోడు పేసర్ అర్షదీప్ సింగ్ గాయం కారణంగా రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరగడం జట్టు 223 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 24 పరుగుల తేడాతో ఇండియా ఓడిపోయింది. ఇక ఐదో టీ20 మ్యాచ్ బెంగళూరు వేదికగా అక్టోబర్ 17వ తేదీన జరగనుంది.
West Indies level the series 2-2.
An important decider awaits in Bengaluru on Saturday.
Scorecard ▶️ https://t.co/ksuQbTW6n5
#TeamIndia | #INDvWI | @mflone_ https://t.co/i7juMPuEe9
— BCCI (@BCCI) October 14, 2026