Reading Time: 2 minutes
Cinema OTT: హాస్టల్ అమ్మాయిలను ఒళ్ళు గగుర్పొడిచే భయం.. ఓటీటీని వణికిస్తున్న వెబ్ సిరీస్.. ఒంటరిగా అస్సలు చూడకండి..

ఓటీటీ వేదికలలో హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ కంటెంట్‌కు ఉండే క్రేజ్ ప్రత్యేకమైనది. రాత్రి వేళల్లో ఒంటరిగా కూర్చుని భయానక దృశ్యాలను ఆస్వాదించే వీక్షకుల కోసం డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లు సరికొత్త వెబ్ సిరీస్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న హిందీ హారర్ థ్రిల్లర్ సిరీస్ ‘ఖౌఫ్’ (Khauf) ప్రస్తుతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ‘ఖౌఫ్’ సిరీస్ కథాంశం ఒక హాస్టల్ వాతావరణం, అక్కడ జరిగే విచిత్రమైన, భయానక ఘటనల చుట్టూ తిరుగుతుంది. ఢిల్లీకి చెందిన ఒక అమ్మాయి తన గతాన్ని మరచిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి హాస్టల్‌లో చేరుతుంది. అయితే ఆమె చేరిన రూమ్‌లో అంతకుముందే కొన్ని మర్మమైన సంఘటనలు జరిగి ఉంటాయి. ఆ గదిలో అడుగుపెట్టినప్పటి నుండి ఆమెకు వింత అనుభవాలు ఎదురవడం, చీకటి పడితే భయానక శబ్దాలు రావడం మొదలవుతాయి. అసలు ఆ హాస్టల్‌లో ఉన్న శక్తులు ఏమిటి? ఆ అమ్మాయి ఆ భయంకరమైన పరిస్థితుల నుండి ఎలా బయటపడింది? అనేదే ఈ సిరీస్ కథ.

ఎక్కువమంది చదివినవి: Bathukamma Song : యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న మంగ్లీ కొత్త బతుకమ్మ పాట.. గంటల్లోనే 

ఈ వెబ్ సిరీస్ విడుదలైనప్పటి నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడమే కాకుండా ప్రముఖ రివ్యూ సైట్ ఐఎమ్‌డిబి (IMDb) లో 7 ప్లస్ (7+) రేటింగ్ సాధించి టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. దర్శకుడు ప్రయాగ్ శెట్టి తెరకెక్కించిన ఈ సిరీస్‌లో నటీనటుల సహజ నటన, అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ , లైటింగ్ థ్రిల్లింగ్ అనుభూతిని కలిగిస్తాయి.

ఎక్కువమంది చదివినవి: Jaya Prada: ఆ హీరోకు అత్తగా నటించా.. అతడు అంటే నాకు పిచ్చి ఇష్టం.. జయప్రద..

కేవలం దెయ్యాలను చూపించి భయపెట్టడమే కాకుండా.. సైకలాజికల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకునిలో ఉత్కంఠను పెంచడంలో ‘ఖౌఫ్’ విజయవంతమైంది. సీన్-సీన్‌కు మధ్య వచ్చే ట్విస్టులు, సస్పెన్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తాయి. వారాంతంలో మంచి హారర్ సిరీస్ చూడాలనుకునే వారికి ప్రైమ్ వీడియోలోని ఈ సిరీస్ పర్ఫెక్ట్ ఛాయిస్.

ఎక్కువమంది చదివినవి: Nana Patekar : నా ఆస్తి ఆ 12 ఎండు కట్టలే.. నేను ముందే పక్కన పెట్టుకున్నా.. నానా పటేకర్ వీడియో షేర్ చేసిన ఆర్జీవీ..

ఎక్కువమంది చదివినవి: Srikanth: ఆ హీరోయిన్ నాకు చాలా స్పెషల్ పర్సన్.. నటనలో మా ఇద్దరికీ పోటీ ఉండేది.. హీరో శ్రీకాంత్..