కిరాణం షాప్లో బీర్లు, మందు అమ్ముడు ఏందయ్యా.. LB నగర్లో ఘటన

హైదరాబాద్: హైదరాబాద్ సిటీలోని LB నగర్లో ఉన్న NTR నగర్లో కిరాణం షాప్లో లిక్కర్ అమ్ముతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు కిరాణం షాపులో తనిఖీలు చేయగా 256 బీర్లు, 50 OC క్వాటర్లు దొరికాయి. పోలీసులు ఈ లిక్కర్ను సీజ్ చేశారు. ఇలా పర్మిషన్ లేకుండా లిక్కర్ అమ్మితే చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. బెల్ట్ షాపులపై ఎల్‌బీ నగర్ ఏసీపీ ఆకస్మిక దాడులు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్‌బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య స్వయంగా ఎన్‌టీఆర్ నగర్‌లోని బెల్ట్ షాపులపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు.
నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్న బెల్ట్ షాపులను తనిఖీ చేసి, అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం స్వాధీనం చేసుకున్నారు. 256బీర్లు, 207 క్వాటర్లు, 90ml 56 బాటిల్స్ పట్టుబడ్డాయి. సంబంధిత నిర్వాహకులపై కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అక్రమ మద్యం విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, బెల్ట్ షాపులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పోలీసులు హెచ్చరించారు.
►ALSO READ | స్విగ్గీ నుంచి గ్యాస్ సిలిండర్ ఇన్స్టంట్ డెలివరీ.. స్టెప్ బై స్టెప్ బుకింగ్ ప్రాసెస్ !