Reading Time: < 1 minute
Jason Sanjay Acting Debut Vijay Son New Movie Rumors

Jason Sanjay: తమిళ స్టార్ హీరో, సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే సిగ్మా చిత్రంతో దర్శకుడిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన జేసన్ సంజయ్, ఇప్పుడు నటుడిగానూ ప్రేక్షకుల ముందుకు రానున్నారనే ప్రచారం వైరల్ అవుతోంది. తమిళ సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రముఖ దర్శకుడి దర్శకత్వంలో జేసన్ సంజయ్ హీరోగా ఓ కొత్త సినిమా తెరకెక్కనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఆ దర్శకుడు ఎవరు అనే విషయం ఇంకా బయటికి రాలేదు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ చిత్రాన్ని ‘పరి మాలా అండ్ కో’ (Pari Mala And Co) చిత్రాన్ని నిర్మించిన నిర్మాత తమిళ్‌కుమరన్ నిర్మించనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా జేసన్ సంజయ్‌ను పూర్తి స్థాయి హీరోగా వెండి తెరకు పరిచయం చేయాలని మేకర్స్ భావిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ విషయాలపై జేసన్ సంజయ్ కానీ, చిత్ర నిర్మాణ సంస్థ గాని ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్‌పై ఇప్పటికే సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన, నిజంగానే హీరోగా కూడా ఎంట్రీ ఇస్తే కోలీవుడ్‌లో దళపతి ప్లేస్‌ను రిప్లేస్ చేస్తాడా లేదా అనే చర్చ జోరుగా సాగుతుంది.