Reading Time: < 1 minute

అర్హుల ఓట్లు తొలగించకుండా చూడాలి : వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

Caption of Image.

పర్వతగిరి, వెలుగు : ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చడం, అనర్హులను తొలగించడం, అవసరమైన మార్పులు, చేర్పులు చేపట్టి ఖచ్చితమైన ఓటర్ల జాబితాను రూపొందించే దిశగా కృషి చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. వరంగల్​ జిల్లా పర్వతగిరి పట్టణ కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్​లో ఆదివారం వర్ధన్నపేట నియోజకవర్గంలోని బీఎల్ఏలు, ఇన్​చార్జీలు, ముఖ్య నాయకులతో సర్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. 

బీఎల్ఏలు పూర్తి సమయాన్ని కేటాయించి ఓటర్ల హక్కులను కాపాడాలనీ పిలుపునిచ్చారు. అనంతరం ఆయా గ్రామాల బూత్ ఏజెంట్లకు సర్ కిట్లను అందజేశారు. అనంతరం పర్వతగిరి మండల అధ్యక్షురాలిగా నూతనంగా నియామకమైన ఇస్లావత్ సావిత్రికి నియామక పత్రాన్ని అందజేసి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్ రావు, సర్పంచ్​శంకర్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు వెంకటేశ్వర రావు, ఏనుమాముల మార్కెట్ డైరెక్టర్  భిక్షపతి, యాకూబ్ పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.