July 12, 2026

TG TET : టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. రేపే(జులై13) ఫలితాలు.. ఇలా మొబైల్‌లోనే చూసుకోండి.!

TG TET : టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. రేపే(జులై13)  ఫలితాలు.. ఇలా మొబైల్‌లోనే చూసుకోండి.!
Reading Time: < 1 minute

TG TET : టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. రేపే(జులై13) ఫలితాలు.. ఇలా మొబైల్‌లోనే చూసుకోండి.!

Caption of Image.

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష( TG-TET ) ఫలితాలు రేపు అనగా జులై 13, సోమవారం మధ్యాహ్నం 02:30 గంటలకు విద్యాశాఖ అధికారులు  విడుదల చేయబోతున్నారు.

జూన్ 16 నుంచి 22 మధ్య రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 1,15,028 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కాగా, ప్రాథమిక కీ ,అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ ఇప్పటికే పూర్తి కావడంతో… ఫైనల్ రిజల్ట్స్‌ను రిలీజ్ చేసేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లూ సిద్ధం చేసింది.

ఫలితాలు విడుదలైన వెంటనే అభ్యర్థులు ఎలాంటి సర్వర్ ఇబ్బందులు లేకుండా… తమ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా చాలా సులభంగా మార్కులను చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం విద్యాశాఖ ప్రత్యేకంగా అధికారిక పోర్టల్‌ను అందుబాటులో ఉంచింది.

అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్ ,డేట్ ఆఫ్ బర్త్ సహాయంతో… https://tgtet.aptonline.in అనే వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి, తమ స్కోర్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

©️ VIL Media Pvt Ltd.