
FIFA World Cup Kylian Mbappe: ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఫ్రాన్స్ కెప్టెన్ ‘కిలియన్ ఎంబాపే’ చెలరేగిపోయాడు. సెనెగల్ తో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ సాధించిన ఎంబాపే ఫ్రాన్స్‌ను 3-1 తేడాతో విజయపథంలో నడిపించాడు. ఈ విజయంతో పాటు పలు చారిత్రాత్మక రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
న్యూజెర్సీలో జరిగిన ఈ మ్యాచ్ తొలి హాఫ్ టైంలో ఎంబాపే ప్రభావం పెద్దగా కనిపించలేదు. సెెనెగల్ ఆటగాళ్ల కట్టుదిట్టమైన డిఫెండ్ కారణంగా అతను కేవలం 14 సార్లు మాత్రమే బంతిని తాకగలిగాడు. దీంతో తొలి 45 నిమిషాల పాటు మ్యాచ్ హోరాహోరీగా సాగింది. అయితే రెండో అర్ధభాగంలో ఎంబాపే తన మార్క్ ఆటను బయటపెట్టాడు. 66వ నిమిషంలో జూల్స్ కౌండే అందించిన అద్భుతమైన త్రూ బాల్‌ను అందుకున్న ఆయన, ఓ వైపు మూల నుండి అద్భుతంగా గోల్ చేసి ఫ్రాన్స్‌కు తొలి ఆధిక్యాన్ని అందించాడు. మ్యాచ్ మొత్తం బాక్స్‌లో అవకాశాల కోసం ప్రయత్నించిన అతను, ఆ క్షణాన్ని మాత్రం ఏమాత్రం వృథా చేయలేదు.
ఆ గోల్ తర్వాత ఫ్రాన్స్ మరింత దూకుడుగా ఆడింది. బ్రాడ్లీ బార్కోలా చక్కటి ఫినిష్‌తో మరో గోల్ సాధించి ఫ్రాన్స్ ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. అయితే అదనపు సమయంలో సెెనెగల్ తరఫున ఎంబాయే గోల్ చేయడంతో స్కోరు 2-1గా మారి మ్యాచ్‌లో కొంత ఉత్కంఠ నెలకొంది. కానీ సెెనెగల్ పునరాగమన ఆశలు ఎక్కువసేపు నిలవలేదు. కొద్ది సేపటికే ప్రమాదకరమైన ప్రాంతంలో బంతిని అందుకున్న ఎంబాపే, దూరం నుంచి బలమైన షాట్‌తో మరో గోల్ సాధించాడు. ఆ గోల్ ప్రత్యర్థి గోల్‌కీపర్‌ను దాటి నేరుగా నెట్ లోకి చేరడంతో ఫ్రాన్స్ విజయం ఖరారైంది.
ఈ మ్యాచ్‌లో చేసిన గోల్‌తో ఎంబాపే ఫ్రాన్స్ పురుషుల జాతీయ జట్టు తరఫున అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు ఒలివియర్ గిరౌడ్ పేరిట ఉన్న 57 గోల్స్ రికార్డును అధిగమించి, కేవలం 99 మ్యాచ్‌ల్లోనే 58 గోల్స్ నమోదు చేశాడు. గిరౌడ్ ఈ మార్కును చేరుకోవడానికి 137 మ్యాచ్‌లు ఆడారు. సెెనెగల్‌పై సాధించిన గోల్‌తో ఎంబాపే తన మొత్తం వరల్డ్ కప్ గోల్స్ సంఖ్యను 14కు చేర్చుకున్నాడు. దీంతో ఫ్రాన్స్ దిగ్గజం జస్ట్ ఫాంటైన్ పేరిట ఉన్న రికార్డును అధిగమించి, వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఫ్రెంచ్ ఆటగాడిగా నిలిచాడు. అలాగే FIFA వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడు మిరోస్లావ్ క్లోజే, మెస్సి (16 గోల్స్) రికార్డుకు కేవలం రెండు గోల్స్ దూరంలో మాత్రమే ఎంబాపే ఉన్నాడు.
France start off strong!
#FIFAWorldCup
— FIFA World Cup (@FIFAWorldCup) June 16, 2026
