Reading Time: < 1 minute
Devara 2 Shelved Koratala Siva Moves On To Balakrishna Movie Due To Ntrs Packed Schedule

దేవర సినిమా రిలీజ్ అయి దాదాపు రెండేళ్లు కావొస్తుంది. కానీ ఇప్పటి వరకు దేవర 2 నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. మధ్యలో ఎన్టీఆర్ దేవర 2 ఉంటుందని కన్ఫామ్ చేసినప్పటికీ.. ఇప్పట్లో మాత్రం ఉండేలా కనిపించడం లేదు.ఇటీవల మే నెలలో ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా గానీ, నిన్న దర్శకుడు కొరటాల శివ పుట్టినరోజున గానీ ‘దేవర 2’ కి సంబంధించి ఎలాంటి అధికారిక అప్‌డేట్ రాకపోవడం ఈ అనుమానాలకు బలాన్ని చేకూర్చింది. ‘దేవర 1’ కోసం కొరటాల శివ దాదాపు రెండేళ్ల పాటు ఎన్టీఆర్ కోసం వేచి చూశారు.

నిజానికి ఇదే ఏడాదిలో దేవర సీక్వెల్ సెట్స్ పైకి వెళ్తుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌తో దాదాపు ఏడాది లాక్ అయిపోయాడు ఎన్టీఆర్. కానీ కొరటాల శివ మాత్రం దేవర2 దగ్గరే ఆగిపోయాడు. మధ్యలో వచ్చిన వార్ 2 కూడా నిరాశపరచడంతో నెక్ట్స్ సినిమాల విషయంలో ఎన్టీఆర్ చాలా ఖరాకండిగా వ్యహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ‘దేవర 2’ స్క్రిప్ట్ వర్క్ పూర్తయినప్పటికీ ఇప్పట్లో దేవర 2 చేసే ఉద్దేశంలో లేడట తారక్. దాంతో ఇక కొరటాల శివ ఖాళీగా ఉండకూడదని భావించి తన తదుపరి చిత్రాన్ని నందమూరి బాలకృష్ణతో లైన్‌లోకి తెచ్చినట్లు ఇండస్ట్రీ టాక్. ఈ సినిమాతో నెవర్ బిఫోర్ రేంజ్ లో హిట్ కొట్టాలని కొరటాల అంటే ఏంటో చూపించాలని పట్టుదలగా ఉన్నాడు. బాలయ్య సినిమాను చాలా   రెస్పాన్సిబిలిటీగా  తీసుకున్నాడు కొరటాల. అటు ఎన్టీఆర్ బర్త్ డే, ఇటు కోరటాల బర్త్ డే రోజు ఎలాంటి ప్రకటన కూడా చేయకపోవడం ఇక ‘దేవర 2’ పూర్తిగా రద్దయినట్టే లెక్క.