Reading Time: < 1 minute
Dk Shivakumar Sworn In As Karnataka Chief Minister New Congress Government

కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా డీకే.శివకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. లోక్‌భవన్‌లో శివకుమార్‌తో గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేరళ సీఎం సతీశన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి,  హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు, కాంగ్రెస్ అగ్ర నేతలంతా హాజరయ్యారు.

డీకే.శివకుమార్ బ్యాగ్రౌండ్

డీకే.శివకుమార్ 1962 మే 15న జన్మించారు. కెంపేగౌడ, గౌర అమ్మ దంపతులకు జన్మించారు. 2020 నుంచి కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. గతంలో 2008 నుంచి 2010 వరకు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, 2014 నుంచి 2019 వరకు కర్ణాటక ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా పని చేశారు. 2008 నుంచి కనకపుర శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకముందు 1989 నుంచి 2008 వరకు సాతనూరు శాసనసభ్యుడిగా ఉన్నారు.  డీకే.సురేష్ అనే తమ్ముడు ఉన్నాడు. 1993లో ఉషను వివాహం చేసుకున్నారు. ఐశ్వర్య, ఆభరణ అనే ఇద్దరు కుమార్తెలు, ఆకాష్ అనే కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్ధార్థ కుమారుడైన అమర్త్యను వివాహం చేసుకుంది.